ETV Bharat / international

రన్​వేపై ఎదురెదురుగా విమానాలు.. లక్కీగా క్షణాల ముందే...

Indian flights collision: దుబాయ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు రావాల్సిన రెండు విమానాలు ఒకేసారి ఒకే రన్​వే మీదుగా టేకాఫ్​కు యత్నించాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. దుబాయ్​లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

flights collision
flights collision
author img

By

Published : Jan 14, 2022, 3:57 PM IST

Updated : Jan 14, 2022, 4:40 PM IST

Indian flights collision Dubai: దుబాయ్ ఎయిర్​పోర్ట్​లో టేకాఫ్ సమయంలో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు పెనుముప్పు తప్పినట్లైంది. ఆదివారం ఈ ఘటన జరిగింది.

ఏమైందంటే?

దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వెళ్లాల్సిన ఈకే-524 విమానం ఆదివారం రాత్రి 9.45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఈకే-568 విమానం ఐదు నిమిషాల తేడాతో బయల్దేరాల్సి ఉంది. అయితే, ఈ రెండు విమానాలు ఒకేసారి రన్​వేపైకి వచ్చేశాయి.

plane collision on runway

'హైదరాబాద్ విమానం టేకాఫ్ కోసం '30ఆర్ రన్​వే'పై వేగంగా దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మరో విమానం వేగంగా వస్తుండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో ఏటీసీ ద్వారా టేకాఫ్​ను నిలిపివేయాలని పైలట్లకు సూచించాం. దీంతో హైదరాబాద్ విమానం నెమ్మదించింది. ట్యాక్సీవే మీదుగా పక్కకు వచ్చేసింది. బెంగళూరు విమానం రన్​వే 30ఆర్ మీదుగా టేకాఫ్ అయింది. హైదరాబాద్ విమానం కొద్ది నిమిషాల విరామం తర్వాత బయల్దేరింది' అని ఈ ఘటన గురించి తెలిసిన అధికారులు వివరించారు.

ఘటనపై దర్యాప్తు

ఈ ఘటనపై యూఏఈ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ(ఏఏఐఎస్) చర్యలు చేపట్టింది. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించింది.

ఈ ఘటన జరిగిందని ధ్రువీకరించిన ఎమిరేట్స్ ఎయిర్​లైన్స్... తీవ్రమైన భద్రతా ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. విమానాలు దెబ్బతినలేదని తెలిపింది. సిబ్బంది తీరుపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 'విమాన ప్రయాణాల విషయంలో ప్రయాణికుల భద్రతే మా తొలి ప్రాధాన్యం. ఏ ఘటన జరిగినా దానిపై అంతర్గత విచారణ నిర్వహిస్తాం. దీనిపై ఏఏఐఎస్ సైతం దర్యాప్తు జరుపుతోంది' అని ఎమిరేట్స్ ఎయిర్ ప్రతినిధి వెల్లడించారు.

సామర్థ్యం ఎంతంటే..

హైదరాబాద్, బెంగళూరుకు నడుపుతున్న సర్వీసులకు బోయింగ్-బీ777 విమానాలను ఉపయోగిస్తోంది ఎమిరేట్స్. వీటి సామర్థ్యం 350 నుంచి 440గా ఉంటుంది. అయితే, ఘటన సమయంలో ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారనేది తెలియలేదు.

ఇదీ చదవండి: అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం

Last Updated : Jan 14, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.