ETV Bharat / international

'అధ్యక్షుడిని అంతమొందించడమే వారి లక్ష్యం' - putin

Ukraine crisis: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీపై రష్యా హత్యాయత్నం విఫలమైందని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈసారి రష్యన్ ప్రత్యేక సేనల నేతృత్వంలోని 25 మంది సైనిక బృందం స్లోవేకియా-హంగేరి సరిహద్దు సమీపంలో పట్టుబడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని అంతమొందించడమే వారి లక్ష్యం అని కీవ్ ​పోస్ట్ ట్విట్టర్​లో పేర్కొంది.

zelensky
వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ
author img

By

Published : Mar 29, 2022, 6:40 AM IST

Ukraine crisis: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీని అంతమొందించేందుకు రష్యా తీవ్రంగా కృషి చేస్తోందా? ఇందుకు అనేక పన్నాగాలు పన్నుతూనే ఉందా?అంటే ఔననే అంటోంది ఉక్రెయిన్‌. తమ అధ్యక్షుడిపై తాజాగా మరో హత్యాయత్నం విఫలమైందని ఉక్రెయిన్‌ వెల్లడించింది. జెలెన్‌స్కీని చంపేయడమే లక్ష్యంగా వచ్చిన 25 మందితో కూడిన రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సైనిక బృందాన్ని స్లోవేకియా-హంగేరి సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ సైన్యం అదుపులోకి తీసుకుందని ఉక్రెయిన్‌లోని కీవ్‌పోస్ట్‌ అనే వార్తా సంస్త తెలిపింది.

'వొలొదిమిర్‌ జెలెన్‌స్కీపై మరో హత్యాయత్నం విఫలమైంది. ఈసారి రష్యన్ ప్రత్యేక సేనల నేతృత్వంలోని 25 మంది సైనిక బృందం స్లోవేకియా-హంగేరి సరిహద్దు సమీపంలో పట్టుబడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని అంతమొందించడమే వారి లక్ష్యం' అని కీవ్‌పోస్ట్‌ ట్విటర్‌లో పేర్కొంది. రష్యా 'టార్గెట్‌ నంబర్‌ వన్‌' నేనేనని సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్‌స్కీ చెబుతూనే ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం రష్యా ప్రత్యేక దళాలు వెతుకుతున్నాయని ఆరోపించారు.

రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈనెల ప్రారంభంలో వారంరోజుల్లోనే మూడుసార్లు హత్యాయత్నం జరగ్గా ఆయన తప్పించుకున్నట్లు 'ది టైమ్స్‌' వార్తాసంస్థ కొద్దిరోజుల క్రితం తెలిపింది. ఉక్రెయిన్‌ అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడంతో మాస్కో ప్రయత్నం విఫలమైనట్లు పేర్కొంది. కీవ్‌ శివార్లలో జెలెన్‌స్కీని హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఉక్రెయిన్‌ తిప్పికొట్టినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​పై దాడులు చేస్తూనే.. మరోవైపు చర్చలకు రష్యా సన్నద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.