ETV Bharat / international

లంకలో ఆగ్రహజ్వాల.. ప్రధాని ఇంటికి నిప్పు.. రాజీనామాకు అధ్యక్షుడు ఓకే

Srilanka Crisis
Srilanka Crisis
author img

By

Published : Jul 9, 2022, 9:43 PM IST

Updated : Jul 9, 2022, 10:46 PM IST

21:40 July 09

రెచ్చిపోయిన ఆందోళనకారులు.. శ్రీలంక ప్రధాని ఇంటికి నిప్పు

Srilanka PM House Fired: శ్రీలంకలో నిరసనకారుల ఆగ్రహం చల్లారడం లేదు. శనివారం మధ్యాహ్నం అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. సాయంత్రం ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రధానిగా రణిల్‌ రాజీనామా నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్​ గ్యాస్​ ప్రయోగించినా.. వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. ప్రధానికి చెందిన కొన్ని వాహనాలను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేసినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.

గత కొంత కాలంగా ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో శనివారం నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. తొలుత వేలాది మంది ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు. అయితే, అంతకుముందే ఆయన తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గొటబాయ రాజపక్స జులై 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారని పార్లమెంటు స్పీకర్​ వెల్లడించారు.

ఇవీ చదవండి: లంకేయుల కన్నెర్ర.. తారస్థాయికి ఆందోళనలు.. ప్రధాని రాజీనామా

శ్రీలంక నిరసనలు ఉద్ధృతం.. అధ్యక్షుడి నివాసం నుంచి పారిపోయిన రాజపక్స!

Last Updated : Jul 9, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.