ETV Bharat / international

Rishi Sunak Israel Visit : ఇజ్రాయెల్ పోరాటానికి బ్రిటన్ మద్దతు.. అండగా ఉంటామన్న రిషి.. అమెరికాకు యుద్ధం సెగ - ఇజ్రాయెల్ హమాస్​ యుద్ధం లేటెస్ట్ న్యూస్

Rishi Sunak Israel Visit : ఇజ్రాయెల్‌ తనను తాను కాపాడుకోవడాన్ని సమర్థిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్​ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ అయిన ఆయన.. పాలస్తీనా ప్రజలు సైతం హమాస్ బాధితులేనని అన్నారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రభావం అమెరికాపై పడింది.

Rishi Sunak Israel Visit
Rishi Sunak Israel Visit
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 12:20 PM IST

Updated : Oct 19, 2023, 5:20 PM IST

Rishi Sunak Israel Visit : హమాస్ మిలిటెంట్ల​పై ఇజ్రాయెల్ విరుచుకుపడటాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సమర్థించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడుకోవడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. హమాస్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్​లో పర్యటించిన ఆయన.. ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ప్రజలు సైతం హమాస్ బాధితులేనని తాము గుర్తిస్తున్నామని అన్నారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేందుకు ఇజ్రాయెల్ సహకరించడాన్ని సునాక్ స్వాగతించారు. హమాస్​తో పోరాటంలో ఇజ్రాయెల్ పక్షాన బ్రిటన్ ప్రజలు నిలబడతారని స్పష్టం చేశారు.

  • #WATCH | Tel Aviv: British Prime Minister Rishi Sunak says, "...I am sorry to be here in such terrible circumstances. In the last two weeks, this country has gone through something that no country, no people should have to endure, least of all Israel...I want to share the deep… pic.twitter.com/9IsctS9PYP

    — ANI (@ANI) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండటంపై చింతిస్తున్నా. అదే సమయంలో, ఓ స్నేహితుడిగా ఈ సమయంలో మీ వద్ద ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నా. గడిచిన రెండు వారాల్లో ఈ దేశం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఒక్కదేశమే కాదు, ఏ దేశ ప్రజలు వీటిని భరించకూడదు. బ్రిటిష్ ప్రజల తరఫున నేను ఇజ్రాయెల్​కు సంఘీభావం ప్రకటిస్తున్నా. ఈ యుద్ధంలో మీకు అండగా ఉంటాం. ఇందులో మీరు గెలవాలని కోరుకుంటున్నాం."
-రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని

'ఈ పోరాటం ప్రపంచానిది'
హమాస్​పై చేస్తున్న పోరాటం తామొక్కరిదే కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ పోరాటం నాగరిక ప్రపంచం మొత్తానిదని తెలిపారు. 'ప్రస్తుతం మేం అంధకారంతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ప్రపంచం మొత్తానికి అంధకారంతో కూడిన పరిస్థితులివి. ఈ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలబడి విజయం సాధించాలి' అని నెతన్యాహు అన్నారు.

  • #WATCH | Israeli PM Benjamin Netanyahu and British PM Rishi Sunak in Tel Aviv

    "This is not merely our battle but it is a battle of the entire civilised world...This is our darkest hour, it is the world's darkest hour. We need to stand together and win...," says Netanyahu.… pic.twitter.com/fiKgmbliTz

బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించగా తాజాగా రిషి సునాక్‌ అక్కడికి వెళ్లడం విశేషం. ఇజ్రాయెల్​కు అండగా ఉంటామని ఆ దేశానికి వెళ్లే ముందు విడుదల చేసిన ప్రకటనలోనూ స్పష్టం చేశారు రిషి. ప్రతి పౌరుని మరణం విషాదమే అని.. హమాస్‌ ఉగ్రదాడుల తర్వాత అనేక మంది మృతి చెందారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా గాజాలో మానవతా సాయం అందించటానికి మార్గం తెరవాలని.. అక్కడ చిక్కుకున్న బ్రిటన్‌ పౌరులు బయటపడటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌.. ఇజ్రాయెల్‌ను కోరినట్లు తెలుస్తోంది.

  • #WATCH | Office of the Prime Minister of Israel tweets, "Israel Prime Minister Benjamin Netanyahu is currently holding a private meeting with British Prime Minister Rishi Sunak at the Prime Minister's Office in Jerusalem. The leaders will also hold an expanded meeting, at the… pic.twitter.com/lVHQvIctzH

అమెరికా క్యాపిటల్‌ను తాకిన యుద్ధ సెగ
US On Israel Palestine Conflict : మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్‌ యుద్ధ సెగ అమెరికా క్యాపిటల్‌ భవనాన్ని తాకింది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులను నిరసిస్తూ కొందరు ఆందోళనకారులు బుధవారం క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. కాల్పుల విరమణ ఒప్పందం చేయాలంటూ నేషనల్​ మాల్​లో నిరసన చేపట్టారు. ఈ ఉద్రిక్తతలను ఆపేలా అమెరికా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. అప్రమత్తమైన భద్రతా బలగాలు నిరసనకారులను అడ్డుకున్నాయి. దాదాపు 300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా సంస్థలు తెలిపాయి. పాలస్తీనా మారణహోమానికి అమెరికా ఆర్థిక సాయం చేస్తూ.. గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్​ బాంబు దాడికి కారణమైందంటూ ఆరోపించారు అమెరికా చట్టసభ్యులు రషీదా త్లైబ్​. క్యాపిటల్​ హిల్​లో నిరసనకారులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్​లో ఉన్న ఏకైక పాలస్తీనా అమెరికన్​ రషీదా త్లైబ్​.. ర్యాలీలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు

గాజా ఆస్పత్రి దాడి ఇజ్రాయెల్​ పని కాదు : అమెరికా
Israel Hospital Blast : గాజా ఆస్పత్రిపై బాంబు దాడికి ఇజ్రాయెల్​ కారణం కాదని అమెరికా అంచనా వేసింది. ఇంటిలిజెన్స్​, క్షిపణి కార్యకలాపాలు, ఓవర్​హెడ్​ ఇమేజరీ లాంటి అంశాల వివిధ అంశాలను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు శ్వేతసౌధం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ఇజ్రాయెల్​లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ నివేదిక బయటకు వచ్చింది.

ఇంకా మృతదేహాల ఖననం పూర్తికాలేదు.. ఐడీఎఫ్​ ట్వీట్
కాగా, హమాస్‌ జరిపిన దాడిలో ఇప్పటివరకు 1300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఇజ్రాయెల్​. ఇప్పటికీ అన్ని మృతదేహాల ఖననం పూర్తికాలేదని వెల్లడించింది. హమాస్‌ దాడులతో మృతదేహాలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అందుకే 13 రోజులు గడిచినప్పటికీ వాటి ఖననంలో జాప్యం జరుగుతోందని ఐడీఎఫ్ గురువారం ట్వీట్ చేసింది.

US Aid To Gaza : గాజాకు అమెరికా రూ.832కోట్ల సాయం.. 10లక్షల మంది ప్రజలకు అండగా..

Biden Israel : 'గాజా ఆస్పత్రిలో పేలుడు.. ఇజ్రాయెల్​ పనికాదు.. వేరే ఎవరో'.. నెతన్యాహుతో బైడెన్

Last Updated : Oct 19, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.