ETV Bharat / international

Israel Hamas War : గాజాపై ఇజ్రాయెల్​ ముప్పేట దాడి.. ఆహారం, కరెంట్​ కట్​.. శిథిలాల కిందే మిలిటెంట్ల సమాధి! - ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం

Israel Hamas War : ఇజ్రాయెల్‌ దాడులతో గాజా పట్టణం గజగజ వణుకుతోంది. గాజాపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు విద్యుత్‌, ఇంధనం ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్‌... మరోవైపు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో గాజాలో దాదాపు 5 వేలకు పైగా ఇళ్లు నేలకూలినట్లు ఐరాస వెల్లడించింది. మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలను చంపేస్తామని హమాస్‌ బెదిరిస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 6:54 AM IST

Updated : Oct 11, 2023, 7:05 AM IST

Israel Hamas War : ఇజ్రాయెల్‌ దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. వైమానిక దాడులు చేయడం వల్ల గాజా నగరంలో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్‌, ఇంధనం, ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్‌... మరోవైపు నుంచి వైమానికి దాడులతో గాజా నగరంపై ముప్పేట దాడి చేస్తోంది. గాజాలోని రెండు వందల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(IDF) ధ్రువీకరించింది. వీటిలో మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్టుమెంట్ భవనం ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను అధికారిక వైబ్‌సైట్‌లో ఉంచింది. దాదాపు 790 హౌసింగ్‌ యూనిట్లు కుప్పకూలగా... 5,330 ఇళ్లు దెబ్బతిన్నాయని ఐరాస మానవత్వ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. దీంతోపాటు 3 తాగునీటి, పారిశుద్ధ్య విభాగ కేంద్రాలూ దెబ్బతిన్నట్లు తెలిపింది. దాదాపు 4 లక్షల మందికి ఈ సేవలు నిలిచిపోయినట్లు వివరించింది. 23 లక్షల జనాభా ఉన్న గాజాలో ప్రస్తుత దాడుల కారణంగా లక్ష 86 వేల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో తల దాచుకునేందుకు వచ్చారు.

Israel Hamas War
ధ్వంసమైన భవనాలు

Israel Palestine Death Count : మరోవైపు వందల మంది హమాస్‌ మిలిటెంట్లు భవనాల కిందే సమాధి అయ్యారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. పాలస్తీనా వాసులు వీలైనంత త్వరగా ఈజిప్టుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది. గాజాకు ఈజిప్టుకు నుంచి సాయం అందుతోంది. 2 టన్నుల ఔషధాలను పంపింది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటిదాకా ఇరువైపుల 1,750 మంది మరణించారు. ఇందులో వెయ్యి మంది ఇజ్రాయెలీలు, 750 మంది పాలస్తీనా వాసులు ఉన్నారు. తాము 1,500 మంది హమాస్‌ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Israel Hamas War
ధ్వంసమైన భవనాలు
Israel Hamas War
ధ్వంసమైన భవనాలు

Israel Palestine War : ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసి గాజాకు తీసుకెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్‌ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్‌ హెచ్చరించింది. హమాస్‌ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది. దాదాపు వంద కుటుంబాల వద్దకు ఈ అధికారులు వెళ్లి... వారి ఆత్మీయులు గాజాలో హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన వారి సంఖ్య వంద నుంచి 150 మధ్యలో ఉంటుందని భద్రతా దళాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. బందీలను హతమారిస్తే హమాస్‌ ఉనికి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీ చేసింది. బందీలుగా ఉన్న వారిలో వృద్ధురాలికైనా, పసికందుకైనా వారు హాని చేస్తే... అది హమాస్‌ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఐడీఎఫ్‌ తెలిపింది. మిలిటెంట్ల చొరబాట్లకు ఇంకా ముప్పు పొంచి ఉన్న వేళ... సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ దళాలకు కీలక ఆదేశాలందాయి. గాజావైపు నుంచి ఎవరైనా సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తే వారిని కాల్చివేయాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశించింది.

Israel Hamas War
ధ్వంసమైన భవనాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Israel Hamas Latest News : మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలును చంపేస్తామని హమాస్‌ బెదిరిస్తోంది. గాజాపై దాడులకు ప్రతీకగా ఇజ్రాయెల్‌లోని ఆష్కెలన్‌ పట్టణంపై మరోసారి రాకెట్‌ దాడులు చేసింది. అంతకుముందు సాయంత్రం 5 గంటల కల్లా ఆష్కెలన్‌ పట్టణ ప్రజలు ఇళ్లను వీడి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. రాకెట్‌ దాడులకు సంబంధించిన వీడియోలను హమాస్ విడుదల చేసింది.

మా మద్దతు ఇజ్రాయెల్​కే : బైడెన్​
ఇజ్రాయెల్​పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. 14 మంది అమెరికన్లు సహా వెయ్యికిపైగా పౌరులను దారుణంగా చంపారని మండిపడ్డారు. అమెరికా మద్దతు ఎల్లప్పుడూ ఇజ్రాయెల్​ వైపే ఉంటుందని స్పష్టం చేశారు. బైడెన్​తో పాటు ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్​.. ఇజ్రాయెల్​ ప్రస్తుత పరిస్థితిపై ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహుతో మాట్లాడారు.

  • #WATCH | US President Joe Biden says, "...More than 1,000 civilians were slaughtered in Israel. Among them, at least 14 American citizens were killed...This is terrorism, but sadly for the Jewish people, it's not new. This attack brought to the surface painful memories and the… pic.twitter.com/a9PPV2Zq35

    — ANI (@ANI) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Child Killed In Israel : చిన్నారులనూ వదలని హమాస్ మిలిటెంట్లు.. యుద్ధంలో 40 మంది బలి..

Israel Cities Empty : నిర్మానుష్యంగా ఇజ్రాయెల్ నగరాలు .. బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడుపుతున్న ప్రజలు

Last Updated : Oct 11, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.