Israel Hamas Ceasefire Agreement Postponed : గాజాలో కాల్పులు విరమణకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు కావడానికి మరింత సమయం పడుతుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. గురువారమే ఒప్పందం అమల్లోకి వస్తుందని భావించినా శుక్రవారంలోపు ఒప్పందం అమలయ్యే అవకాశాలులేవని చెప్పింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇజ్రాయెల్ భద్రత సలహాదారు షసి హేంజ్‌బి ఈ మేరకు ప్రకటించారు. ఇందుకు ఆయన ఎలాంటి కారణం చెప్పలేదు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధానికి 4 రోజులు విరామం ఇవ్వాలని ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఒప్పందం ప్రకారం హమాస్ 50మంది బందీలను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడతాయి. అలాగే ఈ కాల్పుల విరమణ సమయంలోనే గాజాలోకి మరింత ఇంధనం, మానవతాసాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
లక్ష్యం చేరేవరకు యుద్ధం కొనసాగింపు..
Delay In Israel Hamas Ceasefire Agreement : అయితే ఒప్పందం వెంటనే అమలు చేస్తే ఇప్పుడున్న గంభీర వాతావరణాన్ని కొనసాగించడం కష్టమని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజాలో హమాస్ స్థావరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని ఇజ్రాయెల్ అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఒప్పందం ముగిసిన తర్వాత తమ లక్ష్యం చేరుకునే వరకూ యుద్ధం కొనసాగిస్తామని బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చెప్పారు. అంటే ఇప్పుడు ఒప్పందం అమలు చేస్తే లక్ష్యం నెరవేరకుండానే పోరాటం నిలిపివేసినట్లు అవుతుంది. అందుకే వీలైనంతగా హమాస్‌కు నష్టం చేయాలని భావిస్తోంది. అందుకే బుధవారం రాత్రి గాజాపై దాడుల ఉద్ధృతిని ఇజ్రాయెల్ రెట్టింపు చేసింది. భారీ ఎత్తున ఆయుధాలతో విరుచుకుపడిందని గాజా వాసులు చెప్పారు.
ఒప్పందంలో మరిన్ని అంశాలు..
Israel Hamas Truce Deal : యుద్ధం కారణంగా నెలకొన్ని సంక్షోభం తీవ్రతను తగ్గించేందుకు ఖతార్, అమెరికా, ఈజిప్టు దేశాలు ప్రయత్నాలు చేశాయి. ఇరుపక్షాలతో అనేక సంప్రదింపుల తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్యను కుదర్చడంలో విజయం సాధించాయి. ఈ పరిణామంతో గాజాలో మారణహోమంతో వణికిపోతున్న పౌరులకు తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి 4 రోజుల బ్రేక్- ఆ తర్వాత తగ్గేదెెేలే!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్య!- 5రోజుల పాటు యుద్ధానికి బ్రేక్!