ETV Bharat / international

'ఆ బ్యాగ్‌ విలువే 90 వేల డాలర్లు..ఇక అక్రమాస్తులు ఎన్నో'

author img

By

Published : Apr 7, 2022, 9:38 AM IST

Imran Khan Wife Friend Bag: ఇమ్రాన్​ మూడో భార్య బుస్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్​ దుబాయి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మరింది. 90వేల అమెరికన్‌ డాలర్ల బ్యాగ్‌తో ఆమె పారిపోయిందని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) నేత రొమినా ఖుర్షిద్‌ ఆలం ట్విటర్‌లో ఆరోపించారు. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఫొటోపై ఈ విధంగా స్పందించారు.

pak crisis
పాకిస్థాన్​

Imran Khan Wife Friend: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితులు దేశం విడిచి పారిపోతున్నట్టు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో భార్య బుస్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్‌ దుబాయి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. విమానంలో కూర్చొని తన కాలు వద్ద ఓ లగ్జరీ బ్యాగ్‌ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది (ఈ ఫొటో ఎప్పుడు తీసిందో మాత్రం తెలియలేదు). ఫరాఖాన్‌ దుబాయికి వెళ్లిపోవడంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. 90వేల అమెరికన్‌ డాలర్ల బ్యాగ్‌తో ఆమె పారిపోయిందని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) నేత రొమినా ఖుర్షిద్‌ ఆలం ట్విటర్‌లో ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఫొటోను షేర్‌ చేశారు. దీనిపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. పాకిస్థాన్‌ నుంచి ఓ ప్రైవేటు జెట్‌లో దుబాయికి వెళ్లాలంటే 50వేల డాలర్ల కన్నా ఎక్కువ మొత్తమే ఖర్చవుతుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరోవైపు, ఫరాఖాన్‌ భర్త ఆమెకన్నా ముందే పాకిస్థాన్‌ విడిచి వెళ్లినట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఆమె బ్యాగు ఖరీదు దాదాపు 90 వేల డాలర్లని ఇక అక్రమంగా ఎంత సంపాదించివుంటారో అని ముక్కున వేలేసుకుంటున్నారు.

farah khan
ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో భార్య బుస్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్‌

పాకిస్థాన్‌లో అధికారులు తాము కోరుకున్న చోటకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇప్పించడం ద్వారా ఆమె భారీ మొత్తంలో డబ్బు దండుకున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కుంభకోణాన్ని 'మదర్‌ ఆఫ్ ఆల్ స్కాండల్స్‌'గా పేర్కొంటూ దీని విలువ 6 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు (32 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఉంటుందని మండిపడుతున్నాయి. ఇమ్రాన్‌, ఆయన భార్య చెప్పినట్లుగానే ఫరాఖాన్ ఈ అవినీతి చేసినట్టు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ ఉపాధ్యక్షురాలు మరియమ్‌ నవాజ్‌ ఆరోపించారు. ఒకసారి తాను అధికారం కోల్పోతే.. తన అవినీతి అంతా బయటపడుతుందన్న భయం ఇమ్రాన్‌ను వెంటాడుతోందన్నారు. మరోవైపు, ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన మరికొందరు సన్నిహితులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి : సంక్షోభం గుప్పిట్లోనే పాక్‌.. ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.