ETV Bharat / international

Cannes 2022: రెడ్​ కార్పెట్​పై మహిళా నిరసనకారుల రచ్చ - cannes 2022 protest news

Cannes Protest: కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో మహిళా నిరసనకారులు రచ్చ రచ్చ చేశారు. నల్ల దుస్తులు ధరించి రెడ్​కార్పెట్​పై ఆందోళనకు దిగారు. బ్యానర్లు ప్రదర్శించి స్మోక్ గ్రెనేడ్లతో ఆ ప్రాంతమంతా పొగచూరేలా చేశారు.

Cannes 2022
రెడ్​ కార్పెట్​పై మహిళా నిరసనకారుల రచ్చ
author img

By

Published : May 23, 2022, 12:25 PM IST

Female protesters at cannes: ఫ్రాన్స్​లో జరుగుతున్న 75 కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో నిరసనకారులు రచ్చ చేశారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ అర్ధనగ్న ప్రదర్శనతో ఉక్రెయిన్​ను మద్దతుగా ఆందోళనకు దిగగా.. ఆదివారం పదుల సంఖ్యలో మహిళలు నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి బ్యానర్లు ప్రదర్శించారు. స్మోక్ గ్రెనేడ్లతో ఆ ప్రాంతమంతా పొగచూరేలా చేశారు. నిరసనకారులు ప్రదర్శించిన బ్యానర్లపై ఫ్రాన్స్​లో గృహహింస కేసుల్లో పురుషుల చేతిలో హత్యకు గురైన మహిళల పేర్లు ఉన్నాయి.

Cannes 2022
రెడ్​ కార్పెట్​పై మహిళా నిరసనకారుల రచ్చ

ఈ ఘటన అనంతరం 'రిపోస్టె ఫెమినిస్టే' డాక్యమెంటరీ ప్రతినిధి స్పందించారు. నిరసనకారులకు పూర్తి మద్దతు తెలిపారు. స్త్రీవాదానికి మద్దతుగా రిపోస్టె ఫెమినిస్టేను రూపొందించారు. ఫ్రాన్స్​లో మహిళల దారుణ హత్యల నేపథ్యంలోనే ఈ డాక్యుమెంటరినీ తెరకెక్కించారు. హోలీ స్పైడర్ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించే సమయంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. హోలీ స్పైడర్ చిత్రం కూడా మహిళ హత్యల నేపథ్యంలోనే తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం. వేశ్యలను పగబట్టి చంపే ఓ హంతకుడ్ని.. ఇరాన్ మహిళ ఎలా పట్టుకుందనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్​గా ఈ మూవీ తెరకెక్కింది.

ఇదీ చదవండి: 'మాపై అత్యాచారాలు ఆపండి'.. కేన్స్​లో నగ్నంగా ఉక్రెయిన్​ మహిళ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.