ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రేమలో పడ్డారు. కొంత కాలంగా ఈయన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినా.. వీరి ప్రేమ వ్యవహారంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఆమె ఎవరనే వివరాలు బయటకు వచ్చాయి. 'మిస్టరీ వుమెన్'గా పిలుస్తున్న ఆమెను.. మాజీ ఒరాకిల్ సీఈఓ భార్య పాలా హర్డ్ అని తెలిసింది.
రెండేళ్ల క్రితం 2021లో భార్య మెలిందాతో 27 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్. వారు మే 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టులో విడాకుల ప్రక్రియ పూర్తయింది. మెలిందా గేట్స్ మాజీ రిపోర్టర్ జాన్ డూ ప్రీతో రిలేషన్లో ఉన్నారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు బిల్‌గేట్స్‌తో డేటింగ్లో ఉన్న పాలా హర్డ్ ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. మార్క్ హర్డ్ 2019 క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. అప్పటి నుంచి పాలా హర్డ్ ఒంటరిగానే ఉంటున్నారు.
గత ఏడాది నుంచి డేటింగ్లో ఉన్న బిల్‌గేట్స్, హర్డ్ తమ ప్రేమ గురించి గోప్యంగా ఉంచారు. బిల్‌గేట్స్(67), పాలా హర్డ్(60) ఇద్దరూ టెన్నిస్ లవర్స్. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఫైనల్ టోర్నమెంట్లో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తుండగా కెమెరాలు వారి ఫొటోలను క్లిక్‌మనిపించాయి.
ఇవీ చదవండి: