చివరి నిమిషంలో తన 'బ్రెగ్జిట్' ప్రతిపాదనను పార్లమెంట్లో గెలిపించుకోవడానికి బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) మద్దతుతో తన ప్రతిపాదనను గట్టెక్కించాలని భావిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా వైదొలిగితే బ్రిటన్‌కే నష్టమని ఆమె చెబుతున్నారు.
గత రెండు సార్లు థెరిసా మే ప్రతిపాదనలను బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. ఇందుకు ప్రధాన కారణం కన్జర్వేటివ్ పార్టీకి, డీయూపీకి చెందిన 10 మంది సభ్యుల మద్దతు లేకపోవడమే. ఇప్పుడు థెరిసా మేకి మరో ఓటమి ఎదురుకాకుండా ఉండాలంటే డెమొక్రాటిక్ యూనియన్ పార్టీ మద్దతు తప్పనిసరి. అయితే ప్రతిపక్షం మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్య ఎలాంటి విభేదం లేదని చెబుతోంది.
అయితే థెరిసా మేకు మద్దతు ఇవ్వడానికి మాజీ బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ తిరస్కరించారు. మే ప్రతిపాదనలో మరిన్ని మార్పులు అవసరమని వెల్లడించారు.