బ్రిటన్ అధికార పక్షంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో 5జీ నెట్వర్క్ అభివృద్ధి కోసం చైనా సంస్థ హువావేకు అధికారిక అనుమతులిచ్చారనే సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు రక్షణ మంత్రి గవిన్ విలియమ్సన్‌పై వేటువేశారు ఆ దేశ ప్రధాని థెరిసా మే. విచారణ జరిపిన అనంతరం విలియమ్సన్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా మండలి సమావేశం నుంచే సమాచారం లీకైనట్లు తెలిపారు.
రక్షణ మంత్రిపై ప్రధాని విశ్వాసం కోల్పోయినట్లు డౌనింగ్ స్ట్రీట్ పేర్కొంది.
2017 నుంచి విలియమ్సన్ రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆయన స్థానంలో పెన్ని మొర్దంట్ను నియమించారు ప్రధాని మే.
ఇదీ చూడండి: రాహుల్‌గాంధీకి ఈసీ 'షోకాజ్' నోటీసులు