ETV Bharat / international

కరోనా భౌతిక దూరానికి 'బంప్​'తో చెక్​

భౌతిక దూరం.. కొవిడ్​ విలయంలో అన్నింటికన్నా ఎక్కువగా తారసపడుతున్న మాట. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. భౌతిక దూరం పాటించాల్సిందే. కానీ, సామాజిక జీవనానికి అలవాటుపడిన సగటు మనిషి.. దూరంగా ఉండటాన్ని సాధారణంగానే మరిచిపోతున్నాడు. బయటిమాటెలా ఉన్నా.. ఇన్నాళ్లూ కార్యాలయాల్లో కలిసికట్టుగా పనిచేసి ఒక్కసారిగా దూరం లెక్కగట్టలేని పరిస్థితి. భౌతిక దూరం పాటించడం బాగా ఇబ్బందవుతోన్న ఈ తరుణంలో నయా డివైజ్ పరిష్కారం​తో ముందుకొచ్చింది బ్రిటీష్​ సంస్థ.

Bump device
'బంప్​'తో చెక్​
author img

By

Published : Sep 28, 2020, 6:34 PM IST

కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మరోవైపు సరైన వ్యాక్సిన్​ అందుబాటులో లేకపోవడం ప్రజలను కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్థానిక ప్రభుత్వం వరకూ చెబుతున్న మాటల్లా.. కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించండనే. బయట సంగతి ఎలా ఉన్నా.. వందల మంది కలిసి పనిచేసే ఆఫీసుల్లో దూరం పాటించడం కాస్త కష్టమే. అందుకే కొవిడ్​ తెచ్చిన ఈ కష్టాన్ని తీర్చేందుకే బ్రిటన్​లోని రోబోటిక్స్​ సంస్థ థార్సస్​​... 'బంప్'​ డివైజ్​ను తీసుకొచ్చింది.

ఐడీ కార్డులా మెడలో వేసుకొనే ఈ సాధనంతో.. మేలైన పని ప్రదేశంలో అవాంతరాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ బంప్​.. ట్రాఫిక్​ సిగ్నల్​లా పనిచేస్తుందంటున్నారు థార్సస్​ సంస్థ సీఈవో బ్రియాన్ పల్మేర్​.

భౌతిక దూరానికి 'బంప్​'తో చెక్​

"బంప్​- ట్రాఫిక్​ సిగ్నల్​ వ్యవస్థల మధ్య ఒక సారూప్యత ఉంది. సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు డ్రైవర్లకు ట్రాఫిక్​ లైట్లు సూచనలు ఇస్తుంటాయి. ఇదే తరహాలో బంప్​ కూడా పని చేస్తుంది. భౌతిక దూరం పాటించని ప్రదేశాల్లో ఈ పరికరం హెచ్చరిస్తుంటుంది."

- బ్రియాన్ పల్మేర్, థార్సస్​ సంస్థ సీఈవో

భౌతిక దూరం 2 మీటర్ల కన్నా తగ్గితే.. బీప్ శబ్దంతో బ్లూ లైట్ హెచ్చరిస్తుంది. అయినా పట్టించుకోకుండా ఒక మీటర్ కంటే దగ్గరగా వస్తే.. రెడ్​ లైట్​తో పాటు దూరాన్ని గుర్తుచేస్తూ వరుస బీప్​ శబ్దాలతో హోరెత్తిస్తుంది.

"మొదటి నుంచి అందరూ భౌతిక దూరంపై దృష్టి సారించారు. ఇప్పడు చేతులు, ముఖం ముట్టుకోవద్దంటూ చెప్తున్నారు. బంప్ పరికరం​ జనాలకు కొత్త అలవాటును నేర్పుతోంది. జాగ్రత్తగా ఉండండి.. రెండడుగులు వెనక్కి జరగండంటూ హెచ్చరిస్తుంది. అదీ ఎదుటివారు నొచ్చుకోకుండానే చెప్తుంది."

బ్లూటూత్​ ఆధారంగా పని చేసే ఈ పరికరంలో.. జీపీఎస్​ సాంకేతికతతో లోకేషన్​ ట్రాక్​ చేసే అవకాశమూ ఉంటుంది. ఎవరికైనా వైరస్​ సోకితే కాంటాక్ట్​ ట్రేసింగ్​ చేపట్టడం సులభం. ఇప్పటికే పలు సంస్థలు ఈ డివైజ్​ను వినియోగించి సంతృప్తి వ్యక్తం చేశాయి.

"ఈ బంప్​ పరికరాన్ని ప్రధానంగా పని ప్రదేశాల్లో వినియోగిస్తున్నాం. అయితే, ఇది ఇతర ప్రదేశాల్లోనూ వినియోగించొచ్చు. ఎక్కువ మంది హాజరయ్యే సమావేశాల్లో దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాం​."

-పాల్​ బట్లర్, వినియోగదారు

ఈ పరికరాన్ని తయారు చేసిన థార్సస్​.. బ్రిటన్​లో ప్రథమ శ్రేణి రోబోటిక్స్​ సంస్థల్లో ఒకటి. గతంలో బీఎండబ్ల్యూ, రోల్స్​ రాయిస్​ కార్లకు అత్యాధునిక సాంకేతికతతో ఎలక్ట్రానిక్​ పరికరాలు రూపొందించిన అనుభవం ఈ సంస్థ సొంతం. కొవిడ్ సంక్షోభంలో అవకాశాలు అందిపుచ్చుకొని సరికొత్త డివైజ్​ను రూపకల్పన చేసింది. సంస్థ ఉద్యోగులే ఈ పరికరాన్ని వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Bump
భౌతిక దూరానికి 'బంప్​'తో చెక్​

"బంప్​ వినియోగంలో ఇబ్బందులేం లేకుండా అందరం అలవాటుపడిపోయాం. ఎందుకంటే సంస్థలో రోజూ వినియోగిస్తున్నాం. మీరు దగ్గరగా వస్తున్నారు దూరం జరగండంటూ అందరినీ హెచ్చరిస్తోంది ఈ పరికరం."

- రెబెక్కా హెన్రీ, థార్సస్​ సంస్థ ఇంజినీర్​

ప్రస్తుతం పైలట్​ ప్రాజెక్టులో విజయవంతమైన బంప్.. త్వరలోనే మార్కెట్​లోకి అడుగుపెట్టేందుకు ముస్తాబవుతోంది. ఈ డివైజ్​ ధర 79 బ్రిటీష్​ పౌండ్లుగా నిర్ణయించారు. భారత్​లో విడుదల చేస్తే రూ.7వేల పైచిలుకు ఉండే అవకాశాలున్నాయి. మొత్తంగా భౌతిక దూరం పకడ్బందీ అమలుకు.. బంప్​ బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.