ETV Bharat / international

కరోనా పంజా.. ఆ దేశాల్లో మళ్లీ పెరిగిన మరణాలు - covid-19 virus

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. విశ్వవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 30 లక్షల 62 వేలు దాటింది. మొత్తం 210 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలకు విస్తరించిన ఈ వైరస్‌.....2 లక్షల 11 వేల మందికి పైగా బలి తీసుకుంది. 9 లక్షల 21 వేల మందికిపైగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌వ్యాప్తితో చిగురుటాకులా వణుకుతోన్న అమెరికాలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది.

Spain records 331 new virus deaths in 24 hours
కరోనా పంజా.. ఆ 3 దేశాల్లో మళ్లీ పెరిగిన మరణాలు
author img

By

Published : Apr 28, 2020, 6:44 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విస్తరిస్తున్న వేళ.... వైరస్‌ బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకూ 10 లక్షల 10 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. మొత్తంగా 56 వేలకుపైగా చనిపోయారు. జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే 1303 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు. బాధితుల్లో లక్షా 38 వేల మంది కోలుకున్నారు. ఐరోపా దేశాలైన స్పెయిన్​, ఇటలీ, ఫ్రాన్స్​లలో క్రితం రోజుతో పోలిస్తే కరోనా మరణాలు మరోసారి పెరిగాయి.

అక్కడ తగ్గుతూ.. పెరుగుతూ...

  • స్పెయిన్‌లోనూ నిత్యం వేలాది కొత్త కేసులు నమోదవుతుండగా.. నిన్న 331 మంది చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 2లక్షల 29 వేల 422కు చేరింది. మృతుల సంఖ్య 23వేల 521గా నమోదైంది.
  • ఇటలీలో కొవిడ్ కేసులు లక్షా 99 వేల 414 కు చేరగా.. సుమారు 27 వేల మంది చనిపోయారు. సోమవారం మరో 333 మంది మరణించారు.
  • ఫ్రాన్స్‌లో లక్షా 65వేల 842 మంది వైరస్‌ బారినపడగా....23వేల 293 మంది మృతిచెందారు. సోమవారం ఒక్కరోజే 437 మందికి పైగా చనిపోయారు.
  • జర్మనీలో లక్షా 58 వేల 389 మందికి వ్యాధి సోకగా మృతుల సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటివరకూ లక్షా 58 వేల 389 మంది కోలుకున్నారు.
  • బ్రిటన్‌లో లక్షా 57వేల 149 మంది వైరస్‌బారిన పడితే..21 వేల 92 మంది చనిపోయారు.

మిగతా దేశాల్లో...

టర్కీలోనూ వైరస్‌కేసులు లక్షా 12 వేల 261 కి చేరగా...2వేల 900మంది మరణించారు. ఇరాన్‌లో 91వేల 472 మంది బాధితులు కాగా... 5వేల 806 మంది మృత్యువాతపడ్డారు. రష్యాలో కరోనా వైరస్‌విలయతాండవం చేస్తోంది. రోజూ 6వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మొత్తం కేసులు.. 87 వేల 147కు చేరగా...794 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 47 మంది మృతిచెందారు.

చైనాలో కొత్త కేసులు 3 మాత్రమే బయటపడ్డాయి. ఒకరు చనిపోయారు. మొత్తం కేసులు 82వేల 830 కాగా ఇప్పటి వరకూ 4వేల 633 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లో కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం కేసులు 66 వేల 501కు చేరగా.. నిన్న 272 మందికి పైగా చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 4వేల 543 మంది దాటింది. బెల్జియంలోనూ ఇదే పరిస్థితి. మొత్తం బాధితులు 46వేల 687కు చేరగా.....7వేల 207 మంది మృతిచెందారు. నెదర్లాండ్స్‌38 వేల 245 మంది వైరస్‌బారిన పడగా.....4 వేల 518 మంది మృతి చెందారు.

సింగపూర్‌లో కేసుల సంఖ్య 14 వేల 5 వందలకు చేరింది. బంగ్లాదేశ్‌, పిలిప్పీన్స్‌లో కొత్త కేసులు ఎక్కువగానే బయటపడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.