స్పెయిన్లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 832 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 5,600కు చేరింది. సుమారు 72 వేల మందికి కరోనా నిర్ధరణయింది.
ఇరాన్లో...
ఇరాన్లో కొత్తగా 139 మంది వైరస్ ధాటికి చనిపోయారు. ఇప్పటి వరకు దేశంలో 2,517 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో మొత్తం 3,076 కేసులు నమోదు కాగా.. వైరస్ సోకిన వారి సంఖ్య 35,408కి చేరింది.

సామాజిక దూరం పాటించేలా...
ఆస్ట్రేలియాలో మృతుల సంఖ్య 14కు చేరడం వల్ల... అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సామాజిక దూరాన్ని పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నియంత్రణ క్రమంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది శ్రీలంక ప్రభుత్వం. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 4,600 మందిని అదుపులోకి తీసుకోగా.. 1,125 వాహనాలను సీజ్ చేశారు. ఇప్పటికే దేశంలో 106 కేసులు నమోదయ్యాయి.
వేలాది మంది అరెస్టు...
మరోవైపు చైనాలో వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ సమయంలో రవాణా వ్యవస్థపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సబ్వే, షాపింగ్ మాల్స్, బ్యాంకులు తిరిగి ప్రారంభమయ్యాయి.