ETV Bharat / international

రాజకుటుంబం నుంచి హ్యరీ, మేఘన్​ వైదొలిగే తేదీ ఖరారు

author img

By

Published : Feb 20, 2020, 5:52 AM IST

Updated : Mar 1, 2020, 10:08 PM IST

బ్రిటన్​ రాజకుటుంబం నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్​ దంపతులు వైదొలిగేందుకు అధికారిక తేదీ ఖరారైంది. మార్చి 31 తర్వాత వారి నిష్క్రమణ అమలులోకి రానుంది.

Prince Harry, Meghan Markle fix March end for royal exit
రాజకుటుంబం నుంచి హ్యరీ, మేఘన్​ వైదొలిగే తేదీ ఖరారు
రాజకుటుంబం నుంచి హ్యరీ, మేఘన్​ వైదొలిగే తేదీ ఖరారు

బ్రిటన్​ ప్రిన్స్​ హ్యారీ, అయన భార్య మేఘన్ మార్కెల్​లు రాజకుటుంబం నుంచి వైదొలిగేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 31న అధికారికంగా తప్పుకోనున్నారు.

హ్యారీ దంపతుల స్వతంత్ర ఆర్థిక బాధ్యతలపై బకింగ్​హామ్​ ప్యాలెస్​లో జరిగిన తాజా చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రాజకుటుంబం నుంచి వైదొలిగినా అధికారిక సర్దుబాట్లు మాత్రం 12 నెలల తర్వాత జరగనున్నట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.

అధికారిక నిష్క్రమణ అనంతరం..

రాజకుటుంబం నుంచి అధికారికంగా వైదొలిగిన తర్వాత హ్యారీ(35)కి మిలిటరీలో మేజర్​, లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంకులు కొనసాగుతాయి. అయితే వాటితో సంబంధమున్న బాధ్యతల్లో ఆయన అధికారికంగా కొనసాగేందుకు వీలుండదు. హ్యారీ, మేఘన్​ దంపతులకు రాయల్​ బిరుదులు ఉంటాయి. వాటిని అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశం లేదని బకింగ్​హామ్​ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:దిల్లీ కాకుంటే జైపుర్​లో​ ట్రంప్ విమానం​ ల్యాండింగ్​!

Last Updated : Mar 1, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.