ETV Bharat / international

ఆసుపత్రిలో చేరిన పోప్​ ఫ్రాన్సిస్​

పోప్​ ఫ్రాన్సిస్​.. రోమ్​లోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్​ వర్గాలు తెలిపాయి. ఆయన పెద్దపేగుకు సంబంధించిన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.

author img

By

Published : Jul 5, 2021, 8:38 AM IST

Pope Francis
పోప్​ ఫ్రాన్సిస్​

శస్త్రచికిత్స నిమిత్తం పోప్​ ఫ్రాన్సిస్​ ​(84) రోమ్​లోని ఓ ఆస్పత్రిలో చేరినట్టు ఆదివారం మధ్యాహ్నం వాటికన్​ వర్గాలు తెలిపాయి. పెద్దపేగుకు సంబంధించిన వ్యాధి లక్షణాలతో ఆయన బాధపడుతున్నారని పేర్కొన్నాయి. రోమ్​లోని జెమెల్లి పాలిక్లినిక్​లో ఆయన పెద్దపేగులకు శస్త్ర చికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు జరుగుతుందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

మరోవైపు సెప్టెంబరులో హంగరీ, స్లొవేకియాల్లో పర్యటిస్తానని పోప్​ ప్రకటించారు.

ఫ్రాన్సిస్ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే ఊపిరితిత్తుల్లోని కొంత భాగాన్ని తొలగించారు. అంతే కాకుండా సయాటికాతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడు నరాల బలహీనత కూడా ఆయన్ను వేధిస్తుంది.

ఇదీ చూడండి: చైనా ఆయుధాలు కొనేందుకు దేశాల వెనకడుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.