ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Italy Visit).. ఆ దేశ ప్రధానమంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొనేందుకు ఇటలీ పర్యటన చేపట్టారు ప్రధాని. శనివారం ఉదయం ఇటలీ చేరుకున్న ఆయనకు రోమ్‌లోని ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయం ప్లాజో చిగిలో డ్రాగి స్వాగతం పలికారు. అక్కడ మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
జీ20 సమావేశం అనంతరం బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరగనున్న కాప్26 ప్రపంచ నేతల సదస్సులోనూ మోదీ పాల్గొనున్నారు.
ఇదీ చూడండి: ఇటలీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం