ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకూ వేలాది మంది మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మరో 68 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,695 మంది మరణించారు. కేసుల సంఖ్యతో పాటే కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగడం కాస్త సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.
మొత్తం కేసుల సంఖ్య--- 2,52,25,566
యాక్టివ్ కేసులు--- 68,03,002
మరణాల సంఖ్య--- 8,47,676
రికవరీల సంఖ్య--- 1,75,74,888
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 61 లక్షల 41 వేలకు పెరిగింది. మరణాల సంఖ్య 1.86లక్షలకు చేరింది.
- రష్యాలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. కొత్తగా 4,980 కేసులు గుర్తించారు అధికారులు. 68 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 17,093కి పెరిగింది.
- మెక్సికోలో వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. కొత్తగా 673 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 63,819కి చేరింది. 5,974 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 591,712కి చేరుకుంది.
- కొలంబియాలో కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది.
ఫ్రీ ఫ్రీ ఫ్రీ
ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ సిబ్బంది, వీధి వ్యాపారులకు ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచేందుకు, అన్ని వర్గాల ప్రజలకు పరీక్షలు చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొరియా
దక్షిణ కొరియాలో 299 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,699కి పెరిగింది. మరో 323 మంది మరణించారు. దేశ రాజధాని సియోల్లోనే అధికంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
ఆదివారం కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నిర్ధరించిన కేసుల సంఖ్య 56,771కి చేరింది. 110 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 55,447కి పెరిగింది.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 61,41,697 | 1,86,882 |
బ్రెజిల్ | 38,46,965 | 1,20,498 |
రష్యా | 9,90,326 | 17,093 |
దక్షిణాఫ్రికా | 6,22,551 | 13,981 |
పెరూ | 639,435 | 28,607 |
కొలంబియా | 5,99,914 | 19,064 |
మెక్సికో | 5,91,712 | 63,819 |