ETV Bharat / international

ప్రియమైనవారికి ఈ క్రిస్మస్​కు ఏమిస్తున్నారు?​

క్రిస్​మస్​ సందర్భంగా స్నేహితులు, బంధువులకు రకరకాల బహుమతులు ఇస్తూ వారిపై ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాం. కానీ పండుగ​ అంటే కేవలం అలంకరణ, విద్యుత్తు వెలుగులు కాదని, అంతకుమించిన బాధ్యత అని తెలుసా? మరి ఆ బాధ్యతను ఈ కరోనా కాలంలో ఎలా నెరవేరుస్తున్నారు?

gift a mask on this christmas
ప్రియమైనవారికి ఈ క్రిస్మస్​కు ఏమిస్తున్నారు?​
author img

By

Published : Dec 18, 2020, 10:52 AM IST

ప్రియమైనవారికి ఈ క్రిస్మస్​కు ఏమిస్తున్నారు?​

ఈసారి క్రిస్​మస్​కు మీ బంధువులు, ప్రియమైన వారికి బహుమతిగా మాస్క్​ను ఇవ్వమని చెప్తోంది లండన్​లోని 'ఓల్ఫ్​ అండ్​ బాడ్జర్​'​ అనే సంస్థ. ఈ సంస్థ తక్కవ ధర నుంచి అత్యంత ఖరీదైన మాస్కులను రకరకాల ఆకృతులతో రూపొందిస్తోంది. మాస్కుల ధరలను 15 నుంచి 100 బ్రిటిష్​ పౌండ్ల వరకు నిర్ణయించింది. పనికిరాని వస్త్రాలతో కొన్ని మాస్కులను రూపొందిస్తే...మరికొన్ని మాస్కులను మాత్రం విలువైన లోహాలు, రాళ్లతో కలిపి ఇక్కడి ఫ్యాషన్​ డిజైనర్లు తయారుచేశారు.

ఈ సంవత్సరం క్రిస్​మస్​కు అతి త్వరగా, సులభంగా ఇచ్చే బహుమతి ఏదైనా ఉందంటే అది మాస్క్​ మాత్రమే. కరోనా ప్రారంభ దశలో తక్కువ రకాల మాస్కులు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం చాలా రకాల ఫ్యాషన్​ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. అధునాతనమైన ఆకృతులతోనూ మాస్కులు ఉన్నాయి.

- నటాలియా హుజ్​డియాక్​, ఆపరేషన్స్​ మేనేజర్, ఓల్ఫ్​ అండ్​ బాడ్జర్​ స్టోర్

ఈ సంస్థలో పనిచేసే ఫ్యాషన్​ డిజైనర్​ అమందా రైలీ..ఈ క్రిస్​మస్​కు మీ బంధువులకు మీరే స్వయంగా మాస్కు తయారు చేసి ఇవ్వండని సూచిస్తున్నారు. రైలీ.. తన పాత వస్త్రాలతో విభిన్న ఆకృతుల్లో పలు రకాల మాస్కులను తయారు చేశారు. మాస్కును ఎలా తయారు చేయాలన్న దానిపై యూట్యూబ్​లో ఓ వీడియోను సైతం పోస్ట్​ చేశారు.

నా దగ్గర ఉన్న పాత వస్త్రాల నుంచే నేను మాస్కులను తయారు చేశాను. అందులో నాకు బాగా నచ్చిన మాస్కు..జోన్ ఆఫ్​ ఆర్క్​. జోన్ ఆఫ్ ఆర్క్​.. ఓ ధైర్యవంతమైన బాలిక. బహుశా ఈ మాస్కు..తను ఇష్టపడవచ్చు. ఇంకా క్లియోపాత్ర(రాణి), ఎలిజబెత్​, ఎలిజబెత్​ 1, కాళీ మాత.. తదితర వీర వనితల స్ఫూర్తితో మాస్కులను తయారు చేశాను. పాత వస్త్రాలను కట్​ చేసి కొత్తవాటిని మాస్కులుగా తయారు చేయటం చాలా ఆనందంగా ఉంది. వాడి పడేసే మాస్కులతో పర్యావరణ కాలుష్యం అవుతుంది.అందువల్ల వస్త్రాలతో తయారు చేసిన మాస్కులు మేలు.

-​ అమందా రైలీ, ఫ్యాషన్​ డిజైనర్

బ్రిటన్​లో దాదాపు 22 శాతం మంది ఈ క్రిస్​మస్​కు తమ బంధవులు, ప్రియమైన వారికి మాస్క్​ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ఓ సర్వేలో తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.