ETV Bharat / international

Pegasus Spyware : పెగాసస్​ జాబితాలో  ఫ్రాన్స్ అధ్యక్షుడి నంబర్‌! - Emmanuel Macron

ఇజ్రాయెల్​కు చెందిన పెగాసస్​​ సాఫ్ట్​వేర్​ను(Pegasus Spyware) ఉపయోగించి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఫోన్​ కూడా హ్యాకింగ్ చేశారని ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక లీ మాండే వెల్లడించింది. అంతేగాక ఫ్రెంచ్ ప్రభుత్వంలోని మరో 15 మంది ప్రముఖుల ఫోన్లూ హ్యాకింగ్​ లిస్ట్​లో ఉన్నాయని పేర్కొంది.

Pegasus
పెగాసస్
author img

By

Published : Jul 21, 2021, 6:33 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్​ సాఫ్ట్​వేర్​కు(Pegasus Spyware) సంబంధించి కీలక వార్తలను ప్రచురించింది ఫ్రాన్స్​కు చెందిన ప్రముఖ వార్తా పత్రిక లీ మాండే. ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్, మరో 15 మంది ప్రభుత్వ అధికారుల ఫోన్​లు హ్యాకింగ్​కు గురయ్యాయని పేర్కొంది. లీకైన 50వేల ఫోన్​ నంబర్ల లిస్ట్​లో వీరి నెంబర్లు ఉన్నట్లు తెలిపింది.

ఎన్​ఎస్​ఓకు అమెజాన్ షాక్​..

పెగాసస్‌ సైబర్‌ ఆయుధ రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌కు అమెజాన్‌ వెబ్‌ సర్వీసు అందిస్తున్న మౌలిక వసతులు, ఖతాలకు సేవలను నిలిపివేసింది. మదర్‌బోర్డ్‌ అనే పత్రికకు అమెజాన్‌ వెబ్‌సర్వీసు ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి: Pegasus Software: ఒక్క మిస్డ్​కాల్​తో ఫోన్​ హ్యాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.