ETV Bharat / international

వెయ్యికంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం - కరోనా తాజా వార్తలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెయ్యి మంది కంటే ఎక్కువ మంది ఒకచోట సమావేశం కావడంపై ఫ్రాన్స్​ ప్రభుత్వం నిషేధం విధించింది. అటు పోర్చుగల్​ ప్రధాని ప్రజా కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్​ కారణంగా ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.

France bans gatherings of more than 1,000 over virus fears: minister..Portugal's president self-isolates amid virus outbreak
వెయ్యికంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం
author img

By

Published : Mar 9, 2020, 6:34 AM IST

Updated : Mar 9, 2020, 10:48 AM IST

వెయ్యికంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఫ్రాన్స్​ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1000 కంటే ఎక్కువ మంది సమావేశం కావడంపై నిషేధం విధించింది. వైరస్​ను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొంది.

ఇల్లు కదలని అధ్యక్షుడు..

మరోవైపు వైరస్​ ప్రభావిత దేశమైన పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.​ కరోనా వ్యాప్తి కారణంగానే ప్రజా కార్యకలాపాలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇటీవల ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందంతో మార్సెలో సమావేశమయ్యారు. వారిలో ఓ విద్యార్థికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే అధ్యక్షుడికి ఎటువంటి వైరస్​ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. పోర్చుగల్​లో ఇప్పటివరకు 25 కరోనా కేసులు నమోదయ్యాయి.

Last Updated : Mar 9, 2020, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.