ETV Bharat / international

అమల్లోకొచ్చిన 'అణ్వస్త్ర నిషేధ ఒప్పందం' - న్యూ స్టార్​ ఒప్పందం కుదుర్చుకున్న రష్యా

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అణ్వాయుధాల నిషేధానికి సంబంధించిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఐరాస దీన్ని స్వాగతించగా అణ్వాయుధాలున్న అమెరికా, రష్యా మొదలైన దేశాలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించాయి. అణ్వస్త్ర దాడికి గురైన జపాన్ దీన్ని సమర్థించకపోవడం గమనార్హం.

first-ever-treaty-to-ban-nuclear-weapons
అమల్లోకొచ్చిన 'అణ్వస్త్ర నిషేధ ఒప్పందం'
author img

By

Published : Jan 23, 2021, 12:52 PM IST

అణ్వాయుధాల నిషేధానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మారణాయుధాల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించే దిశగా ఇది ఒక చరిత్రాత్మక అడుగు అని పలువురు అభివర్ణించారు. అణ్వస్త్ర దేశాలు మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకించాయి.

రెండో ప్రపంచ యుద్ధసమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులు వేసి, వేల మందిని బలితీసుకుంది. అలాంటి ఘోరం పునరావృతం కాకుండా ఆ సామూహిక జనహనన ఆయుధాల నిషేధం కోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం అణ్వస్త్ర నిషేధ ఒప్పందం తెరపైకి వచ్చింది. దీనికి తుది ఆమోదం తెలిపిన దేశాలు అణ్వాయుధాలను పూర్తిగా త్యజించాలి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా సంక్లిష్టం.

జపాన్​ కూడా....!

అణ్వస్త్రాలు కలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాలతోపాటు నాటో కూటమిలోని 30 దేశాలు ఆ ఒప్పందాన్ని సమర్థించలేదు. అణ్వస్త్ర దాడికి గురైన జపాన్‌ కూడా దీనికి పచ్చజెండా ఊపలేదు. అణ్వస్త్ర, అణ్వస్త్రేతర దేశాల మధ్య ఈ అంశంపై తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో నిషేధ ఒప్పందం నిష్ప్రయోజనమని జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే 'ఇంటర్నేషనల్‌ కాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌' సంస్థ కృషి వల్ల ఒప్పందం విషయంలో ముందడుగు పడింది. 2017 జులైలో ఐరాస సర్వప్రతినిధి సభ దీనికి ఆమోదం తెలిపింది. 120కిపైగా దేశాలు దీనికి పచ్చజెండా ఊపాయి. అనంతరం ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే కనీసం 50 దేశాలు దాన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబరులో 50వ ర్యాటిఫికేషన్‌ పూర్తయింది. ఆ తర్వాత నిర్దేశిత రీతిలో 90 రోజుల విరామాన్ని పూర్తిచేసుకొని శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది.

ఒప్పందాన్ని ర్యాటిఫై చేసిన దేశాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను, అణ్వస్త్ర పేలుడు పరికరాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ఉత్పత్తి చేయడం, సమీకరించడం వంటివి చేయకూడదు. అణ్వాయుధాల బదిలీ, వాటిని ప్రయోగిస్తామన్న హెచ్చరికలూ నిషిద్ధం. తాజా పరిణామంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ స్పందిస్తూ... అణు నిరాయుధీకరణ విషయంలో బహుళపక్ష విధానాలకు దక్కిన మద్దతుగా దీన్ని అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టానికి, ఐరాసకు, అణుదాడి బాధితులకు దక్కిన గొప్ప విజయమని 'ఇంటర్నేషనల్‌ కాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌' ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీట్రస్‌ ఫిన్‌ పేర్కొన్నారు.

ద్వైపాక్షిక అణు ఒప్పందాన్ని పొడిగించుకుందాం

అమెరికా అణ్వాయుధాల నియంత్రణకు ఉద్దేశించిన 'న్యూ స్టార్ట్' ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకుందామని రష్యాకు ప్రతిపాదించింది అమెరికా. దీనివల్ల అమెరికా జాతీయ ప్రయోజనాలకు మేలు కలుగుతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నారని వైట్‌హౌస్‌ తెలిపింది. 2026 వరకూ దీన్ని పొడిగించుకోవడం వల్ల మెరుగైన ఆయుధ నియంత్రణ ఒప్పందాల కోసం రెండు దేశాలు ప్రయత్నించడానికి సమయం లభిస్తుందని పేర్కొంది. మరోవైపు అమెరికా ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. దీనిపై పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ పేర్కొన్నారు. ‘న్యూ స్టార్ట్‌’ ప్రకారం.. అమెరికా, రష్యాలు తమ అణు వార్‌హెడ్‌లను 1550కి మించి మోహరించరాదు. ఈ ఒప్పందం వచ్చే నెల 5న ముగుస్తుంది.

ఇదీ చదవండి:తాలిబన్​ ఒప్పందంపై అమెరికా యూటర్న్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.