ETV Bharat / international

తొలి వారం రోజులే కరోనా ప్రభావం అధికం! - how many days Covid-19 effect

కరోనా సోకిన తొలి వారం రోజులే వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడే వైరస్​ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని వెల్లడైంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పరిశోధనకులు సూచిస్తున్నారు.

COVID-19 patients likely to be most infectious during first week after symptom onset: Study
తొలి వారంరోజులే కరోనా ప్రభావం అధికం!
author img

By

Published : Nov 20, 2020, 1:21 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​పై విస్తృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్​ జన్యు పదార్థం శ్వాసకోశ, మలం నమూనాల్లో వారాలపాటు ఉండిపోతుందని గతంలో కనుగొన్న శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కొత్త విషయాలను చెప్పుకొచ్చారు. కరోనా లక్షణాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల తర్వాత శ్వాసకోశ, మలం నమూనాల్లో ఎటువంటి వైరస్ కణాలను గుర్తించలేదని వివరించారు.

బ్రిటన్​కు చెందిన సెయింట్​ ఆండ్రూస్​ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన చేసింది. దీనికి సంబంధించిన అంశాలను 'ద లాన్సెట్​ మైక్రోబ్​ జర్నల్​'లో ప్రచురించారు.

కరోనా సోకిన తొలి ఐదు రోజుల్లోనే వైరస్​ ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధనలో తేల్చింది. ఈ సమయంలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా సోకుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధనలో మూడు రకాలైన (సార్స్​-కోవ్​-2, సార్స్-కోవ్​, మెర్స్​-కోవ్​) కరోనా వైరస్​లపై సమగ్రంగా అధ్యయనం చేసి.. వాటి మధ్య తేడాలను గుర్తించామని పరిశోధనకు నాయకత్వం వహించిన ముగే సెవిక్​ తెలిపారు. వైరల్​ లోడ్​ తగ్గడానికి పట్టే సమయం వంటి విషయాలను విస్తృతంగా విశ్లేషించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎగువ శ్వాసకోశాల్లో వైరస్​ ఆర్​ఎన్​ఏ తొలగడానికి 17 రోజులు, దిగువ శ్వాసకోశాల్లో 14.6 రోజులు, మలంలో 17.2రోజులు, సీరంలో 16.6 రోజుల్లో సమయం పడుతుందని పరిశోధనలో వెల్లడైంది.

ఇదీ చూడండి: ఇటలీ ప్రజలకు జనవరిలోనే టీకా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.