కొవిడ్ కారణంగా లాక్డౌన్ విధించి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్వాసులు జులై 19న 'ఫ్రీడమ్ డే' గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ అద్భుతమైన వెడ్డింగ్ డ్రెస్‌ను రూపొందించారు. 1500 మాస్క్‌లను రీసైక్లింగ్ చేసి ఫ్లోర్ లెంగ్త్ తెలుపు రంగు గౌన్‌ను తయారు చేశారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'గౌన్' ధరించిన మోడల్..
టామ్ సిల్వర్‌వుడ్ అనే డిజైనర్ ఈ మాస్క్‌ల గౌన్‌ను తయారు చేశారు. మోడల్ జమీమా హంబ్రో ఈ వెడ్డింగ్ గౌన్ ధరించి ప్రముఖ సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చ్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు.
హిచ్డ్ అనే వెడ్డింగ్ ప్లానర్ వెబ్సైట్ గౌన్ తయారీకి పెట్టుబడి పెట్టింది. ఈ వెబ్‌సైట్‌తో కలిసి వెడ్డింగ్ గౌన్ తయారు చేయడం ఆనందంగా ఉన్నట్లు టామ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: మీ గుండె కుడివైపున ఉందని తెలిస్తే..!