ETV Bharat / international

బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ ప్రమాణం నేడే - బోరిస్ జాన్సన్

బ్రిటన్​ నూతన ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్​ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బ్రెగ్జిట్​ కారణంగా పదవి నుంచి తప్పుకున్న థెరిసా మే రాజీనామా అనంతరం జాన్సన్​ ప్రధానిగా ఎన్నికయ్యారు.

బ్రిటన్​ ప్రధానిగా బోరిస్
author img

By

Published : Jul 24, 2019, 7:16 AM IST

బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రెగ్జిట్ వివాదంతో పదవి నుంచి తప్పుకున్న థెరిసా మే నుంచి బోరిస్ జాన్సన్ నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకు ముందు బ్రిటన్​ రాణి ఎలిజబెత్​కు రాజీనామా పత్రం అందిస్తారు థెరిసా.

అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు జరిగిన ఓటింగ్‌లో ఆ పార్టీకి చెందిన 1.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్​కు 92,153 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి జెరెమీ హంట్​కు 46 వేల 656 ఓట్లు వచ్చాయి.

గతంలో విదేశాంగ మంత్రిగా, లండన్ మేయర్‌గా జాన్సన్ పనిచేశారు. జెరెమీ హంట్ కూడా బ్రిటన్ విదేశాంగ మంత్రిగా సేవలందించారు. బ్రెగ్జిట్‌ను పూర్తి చేసి.. దేశాన్ని ఏకం చేయడమే తన ముందున్న సవాళ్లని జాన్సన్ స్పష్టం చేశారు.

అక్టోబర్ 31 నాటికల్లా బ్రెగ్జిట్ ఒప్పందం పూర్తయ్యేలా చూస్తామన్నారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధానిగా జాన్సన్​- బ్రెగ్జిట్టే అజెండా

New Delhi, July 24 (ANI): President Ram Nath Kovind attended a cultural event "Divya Kala Shakti: Witnessing Ability in Disability" in New Delhi yesterday. The event was organised by Ministry of Social Justice and Empowerment. The programme was anchored by 3 youths with visual impairments disabilities. The Vice President and Chairman, RajyaSabha Shri M. Venkaiah Naidu, the Prime Minister Shri Narendra Modi, the Speaker, LokSabha Shri Om Birla were the Guests of Honour. After the event, PM Modi interacted with divyang children.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.