ETV Bharat / international

యుద్ధానికి సన్నద్ధం కండి-సైనిక దళాలకు జిన్​పింగ్​ పిలుపు! - JAMMU KASHMIR

భారత్​-చైనా ఉద్రిక్తతలపై సైనిక, దౌత్య స్థాయిల్లో చర్చలు జరుపుతున్న డ్రాగన్​.. మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు షి జిన్​పింగ్​.. సైన్యంతో 'యుద్ధానికి సన్నద్ధం కావాలని, దేశానికి పూర్తి విధేయంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు' ఓ వార్తాసంస్థ నివేదించింది.

Xi asks Chinese troops to 'put minds and energy on preparing for war'
యుద్ధానికి సన్నద్ధం కండి-సైనిక దళాలకు జిన్​పింగ్​ పిలుపు!
author img

By

Published : Oct 15, 2020, 5:52 AM IST

యుద్ధానికి సన్నద్ధం కావాలని, దేశానికి పూర్తి విధేయంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ తన సైనిక దళాలకు పిలుపునిచ్చారు. చైనా సైన్యం కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోర్​ దళాన్ని మంగళవారం పర్యవేక్షించిన సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. చైనా అధికారిక మీడియాను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

ఇదీ చూడండి: సుదీర్ఘ చర్చలు ఫలించేనా? ఉపసంహరణ జరిగేనా?

''యుద్ధానికి సన్నద్ధం కావడంపైనే మీ శక్తియుక్తులు, దృష్టినంతటినీ కేంద్రీకరించండి. అత్యంత అప్రమత్తంగా ఉండండి. పూర్తి స్వచ్ఛంగా, విశ్వసనీయంగా ఉండండి.'' అని జిన్​పింగ్​ సైనిక దళాలకు స్పష్టం చేశారు. భారత్​ను లేదా అమెరికాను లేదా మరే ఇతర దేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం కాలేదు. తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో భారత్​-చైనాల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇది చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: లేహ్​లో రాత్రివేళలోనూ యుద్ధవిమానాల గర్జన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.