అత్యంత వయోవృద్ధుడిగా గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కిన జపాన్‌కు చెందిన వాటనేబ్ మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు ఆ దేశ వార్తా సంస్థలు వెల్లడించాయి.
1907 లో జపాన్-నీగాటాలో జన్మించిన వాటనేబ్.. 112 ఏళ్ల 355 రోజులు జీవించారు. గత వారమే ప్రపంచ కురువృద్ధుడిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. వాటనేబ్కు ఐదుగురు సంతానం కాగా 16 మంది మనుమళ్లు, 12 మంది మనుమరాళ్లు, మునిమనుమళ్లు ఉన్నారు.
తన ఆరోగ్య రహస్యం గురించి ఎప్పుడు ప్రస్తావించినా.. కోపాన్ని అదుపులో ఉంచుకొని నవ్వుతూ ఉండాలని చెప్పేవారు వాటనేబ్.
ఆ రికార్డు ఆమె పేరిటే...
మహిళా విభాగంలో ప్రపంచ కురువృద్ధుల రికార్డు జపాన్‌కు చెందిన బామ్మ పేరిటే ఉంది. 117 ఏళ్ల కానే తనాకా అనే భూమిపై అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పింది.
ఇదీ చదవండి: 113 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే.!