ETV Bharat / international

'త్వరలోనే భారత్​కు ఎస్​-400 క్షిపణులు' - రక్షణ రంగంలో భారత్​కు చేయూత

రక్షణ రంగంలో భారత్​ను బలపరిచేందుకు రష్యా ముందడుగు వేస్తోందని డిప్యూటీ చీఫ్​ రోమన్ బాబుష్కిన్​ అన్నారు. ఎస్​-400 క్షిపణులను భారత్​కు త్వరగా పంపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా చేసిన బ్రహ్మోస్​ క్షిపణులను ఇతర దేశాలకు విక్రయించునున్నట్లు పేర్కొన్నారు.

INDO_RUSSIA
'ఎస్​-400 క్షిపణులను అతిత్వరలో భారత్​కు పంపిస్తాం'
author img

By

Published : Nov 12, 2020, 6:52 PM IST

అధునాతన ఎస్-400 క్షిపణులను భారత్​కు త్వరితగతిన చేర్చేందుకు కృషి చేస్తున్నామని రష్యా పేర్కొంది. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ మిసైల్​ ఒప్పందానికి డిప్యూటీ చీఫ్​గా వ్యవహరిస్తోన్న రోమన్ బాబుష్కిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారత్- రష్యా సంయుక్తంగా తయారు చేస్తోన్న 200 కామోవ్ కేఏ-226టీ యుద్ధ హెలికాప్టర్లతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం.. వచ్చే ఏడాది చివరి కల్లా భారత్​కు ఎస్-400 క్షిపణులను అందించాలి రష్యా. 2018 అక్టోబర్​లో ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

రష్యాతోనే మరింత సన్నిహితంగా...

ఇతర దేశాలతో సన్నిహితంగా మెదులుతున్నా.. భారత్​కు రష్యాతోనే సత్సంబంధాలు ఎక్కువని బాబుష్కిన్ అన్నారు. అక్టోబర్​లో​ భారత్​-అమెరికా మధ్య జరిగిన 'బెకా' ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో భారత్​ను మరింత ధృడపరిచేందుకు ఇరుదేశాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని అన్నారు.

ఫిబ్రవరిలో బెంగుళూరులో జరగనున్న ఏరో ఇండియా ఎగ్జిబిషన్​లో పాల్గొనేందుకూ రష్యా వేచిచూస్తోందని బాబుష్కిన్​ తెలిపారు.

సంయుక్తంగా బ్రహ్మోస్​!

భారత్​, రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్​ సోనిక్ క్షిపణులను ఇతర దేశాలకు విక్రయించనున్నట్లు బాబుష్కిన్​ పేర్కొన్నారు. ముందుగా ఫిలిప్పీన్స్​తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఇటీవలే అధునాతన బ్రహ్మోస్​ మిసైల్​లను పరీక్షించామని వెల్లడించారు.

ఇదీ చదవండి:ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.