ETV Bharat / international

'బ్రహ్మపుత్ర డ్యాంపై భారత్​కు ఆందోళన అనవసరం' - చైనా వార్తలు

బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మించాలనుకుంటున్న చైనా.. గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టుపై ఆందోళన అవసరం లేదని, సరిహద్దుల్లోని భారత్​, బంగ్లాదేశ్​తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని ఉద్ఘాటించింది. యార్లంగ్​ జాంగ్బో నది పరీవాహక ప్రాంతాల్లో జల విద్యుత్​ అభివృద్ధి తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది.

Will have good communication with India
'బ్రహ్మపుత్ర మీదుగా డ్యాంపై ఆందోళన అనవసరం'
author img

By

Published : Dec 3, 2020, 6:12 PM IST

Updated : Dec 3, 2020, 6:48 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి బ్రహ్మపుత్ర నదిపై(చైనాలో యార్లంగ్​ జాంగ్బో నది) చైనా భారీ జల విద్యుత్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే.. చైనా ఆనకట్టల ప్రతిపాదనలు భారత్​, బంగ్లాదేశ్​లోని నదీ పరీవాహక రాష్ట్రాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్యాం ప్రణాళికలపై మాట్లాడారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హ్యూ చున్​యింగ్​. యార్లంగ్​ జాంగ్బో నదీ పరీవాహక ప్రాంతాల్లో జల విద్యుత్​ ఉత్పత్తి చైనా చట్టబద్ధమైన హక్కు అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: బ్రహ్మపుత్రపై చైనా భారీ హైడ్రోపవర్​ ప్రాజెక్ట్!

''యార్లంగ్​ జాంగ్బో నది దిగువ ప్రాంతాల్లో జల విద్యుత్​ అభివృద్ధి చైనా చట్టబద్ధమైన హక్కు. సరిహద్దుల్లోని నదుల వినియోగం, అభివృద్ధి విషయంలో చైనా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుంది.''

- హ్యూ చున్​యింగ్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఎగువ ప్రాంతంలో డ్యాం ఏర్పాటు అంశంపై భారత్​ ఇప్పటికే తన అభిప్రాయాలు, ఆందోళనలను చైనా అధికారులకు తెలియజేసింది​. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను చైనా దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు హాని జరగకుండా చూసుకుంటూ ఎగువ భాగాన నిర్మాణాలు చేపట్టాలని కోరింది. బ్రహ్మపుత్ర నది కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ. జలాల మళ్లింపు చేపట్టడం లేదని.. చైనా తమకు ఎన్నో సార్లు చెప్పిందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్​కు లాభం!

ఈ నేపథ్యంలో.. చున్​యింగ్​ స్పందించారు. భారత్​, బంగ్లాదేశ్​తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని, అవి కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.

''చాలా కాలంగా చైనా, భారత్​, బంగ్లాదేశ్.. జల సంబంధిత సమాచారం, వరద, విపత్తు నివారణ, ఆకస్మిక నిర్వహణలో మంచి సమన్వయంతో ఉన్నాయి. ఒకరికొకరం అభిప్రాయాలను పంచుకుంటున్నాం. ఈ సహకారం కొనసాగుతుంది.''

- హ్యూ చున్​యింగ్​

టిబెట్​ మీదుగా భారత్​లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్ ఉత్పత్తి​ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు పవర్​ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్​ ఆఫ్​ చైనా ఛైర్మన్​ యాన్​ ఝియాంగ్​. ఈ మేరకు గ్లోబల్​ టైమ్స్​ వెల్లడించింది.

" యార్గాంగ్​ జాంగ్బో నది (టిబెట్​లో బ్రహ్మపుత్ర నది పేరు)పై జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు నీటి వనరులు, దేశీయ భద్రతను నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది."

- యాన్​ ఝియాంగ్​, పవర్​ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్​ ఆఫ్​ చైనా ఛైర్మన్​

చైనా 2015లోనే 1.5 బిలియన్​ అమెరికా డాలర్ల వ్యయంతో టిబెట్​లో అతిపెద్ద జామ్​ హైడ్రోపవర్​ స్టేషన్​ నిర్మాణం చేపట్టి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది.

చైనాకు పోటీగా.. బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్‌ కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 10 గిగావాట్ల సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రహ్మపుత్ర నదిపై 60 గిగావాట్ల ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమైన వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనాకు దీటుగా బ్రహ్మపుత్ర నదిపై భారత్​ ప్రాజెక్టు!

Last Updated : Dec 3, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.