కరోనా వ్యాప్తి తగ్గినట్లే తగ్గి... మళ్లీ ఒక్కసారిగా విజృంభిస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 18 లక్షలు దాటింది. ఇప్పటివరకు లక్షా 29 వేల 500మందికి పైగా కొవిడ్‌తో మరణించారు.
పది రోజుల్లో 10 లక్షల కేసులు
అమెరికాలో నవంబర్ నెల ప్రారంభం నుంచి కేవలం పదిరోజుల్లో 10 లక్షల కేసులు బయటపడ్డాయి. అంటే రోజూ సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందు కఠిన చర్యలు చేపడుతున్న విస్కాన్సిన్, ఇల్లినాయీ రాష్ట్రాల్లోనే భారీగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఫలితంగా కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజే లక్షా 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. మరో 1,345మంది మృతి చెందారు.
ఐరోపా దేశాల్లో కరోనా బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 1,05,59,184 | 2,45,799 |
బ్రెజిల్ | 57,01,283 | 162,842 |
ఫ్రాన్స్ | 18,29,659 | 42,207 |
రష్యా | 18,17,109 | 31,161 |
స్పెయిన్ | 1,443,997 | 39,756 |
అర్జెంటీనా | 12,62,476 | 34,183 |
బ్రిటన్ | 12,33,775 | 49,770 |
ఇటలీ | 9,95,463 | 42,330 |
ఇదీ చూడండి: 'ఓటమిని ఒప్పుకోకపోవడం అధ్యక్ష హోదాకు సరికాదు'