ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రష్యా, ఇటలీ, పోలండ్ సహా పలు దేశాల్లో కొవిడ్ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6 కోట్ల 16లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 14 లక్షల 43 వేలు దాటింది.
జర్మనీలో కొత్తగా 22,806 కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది.
- ఇటలీలో కొవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 28,352 కరోనా సోకింది. 827 మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో తాజాగా 27,543 బయటపడ్డాయి. మరో 496 మంది మరణించారు.
- పోలండ్‌లో ఒక్కరోజే 17,060 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 579 మంది మహమ్మారికి బలయ్యారు.
- ఇరాన్లో తాజాగా 14,051కి కరోనా సోకగా.. మరో 406 మంది చనిపోయారు.
- మెక్సికోలో కరోనా మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 645 మంది చనిపోయారు. మరో 8 వేలమందికిపైగా వైరస్ బారిన పడ్డారు.
- నేపాల్‌లో తాజాగా 1,703 నమోదైన కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 30 వేలకు చేరువైంది.
- దక్షిణ కొరియాలో వరుసగా రెండోరోజు 500 కేసులు బయటపడ్డాయి.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
రష్యా | 22,15,533 | 38,558 |
ఫ్రాన్స్ | 21,83,660 | 50,957 |
ఇటలీ | 15,38,217 | 53,677 |
మెక్సికో | 10,78,594 | 1,04,242 |
జర్మనీ | 10,13,582 | 15,911 |
ఇదీ చూడండి: ఎలుకలు కలుషితం చేసిన ఆహారం తిన్నా: మరియం