అఫ్గానిస్థాన్లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఖొగ్యానీ జిల్లాలోని గండమక్ ప్రాంతంలో ప్రభుత్వ చెక్పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ దాడిలో 16 మంది సైనికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా వెల్లడించింది.
ఈ ఘటనలో మూడు భద్రతా స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఖతార్లో శనివారం ప్రారంభం కానున్న ఇంట్రా-అఫ్గాన్ శాంతి చర్చలకు ముందే ఈ దాడి జరగడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసాకాండ నుంచి శాశ్వత విముక్తి కల్పించడానికి ఈ చర్చలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్ మధ్య డీల్..!