ETV Bharat / international

'అన్నీ తెలిసే నేరం చేశాడు.. అతనికి 'ఉరి' తప్పదు'

సింగపూర్​లో వచ్చే వారం ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న భారత సంతతికి చెందిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభ్యర్థనలపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. అన్నీ తెలిసే అతను నేరం చేశాడని.. నాడు జరిగిన అంశాలపై నిందితునికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది.

singapore
సింగపూర్
author img

By

Published : Nov 6, 2021, 2:10 PM IST

Updated : Nov 10, 2021, 8:24 AM IST

సింగపూర్‌లోని చాంగి జైలులో శిక్ష అనుభవిస్తున్న నాగేంద్రన్ కె.ధర్మలింగంకు ఉరిశిక్ష అమలుపై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. నాగేంద్రన్‌కు మానసిక వైకల్యం లేదంటూ వైద్యులిచ్చిన సాక్ష్యాలను కోర్టు పరిగణించిదని స్పష్టం చేసింది. ఈ నెల 10న మరణశిక్ష విధించనున్నట్లు తేల్చిచెప్పింది. నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దుచేయాలంటూ మానవ హక్కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందీ కేసు.

అతని ఉరిశిక్ష రద్దు కోరుతూ అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా ప్రారంభమైన ఓ పిటిషన్​పై 56,134 మంది సంతకాలు చేశారు. నాగేంద్రన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 10న నాగేంద్రన్​కు మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు సింగపూర్ జైలు అధికారులు అక్టోబర్ 26న తన తల్లికి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వరుస తిరస్కరణలు..

  • 2009లో సింగపూర్​లోకి 42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్‌కు 2010లో మరణశిక్ష విధించింది కోర్టు.
  • తనపై మోపిన నేరారోపణలను కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించగా 2011-సెప్టెంబర్​లో అప్పీల్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
  • ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగారశిక్ష విధించాలని 2015లో నాగేంద్రన్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ దరఖాస్తును హైకోర్టు 2017లో కొట్టివేసింది.
  • 2019లో చేసుకున్న మరో అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. చివరిగా క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ సైతం తిరస్కరణకు గురైంది.

'మానసిక వైకల్యం లేదు..'

అయితే ధర్మలింగం ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. ఈ మేరకు 'టుడే వార్తాపత్రిక' ఓ కథనాన్ని ప్రచురించింది.

'ఉరిశిక్ష రద్దు చేయండి..'

తన ప్రియురాలిని చంపేస్తామని బెదిరించిన కొందరు.. నాగేంద్రన్​తో బలవంతంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయించారని.. అందువల్ల దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని మానవహక్కుల కార్యకర్తలు అభ్యర్థిస్తున్నారు.

కాపాడిన కరోనా..

  • ఉరిశిక్షకు ముందు నాగేంద్రన్‌ ధర్మలింగానికి కరోనా రూపంలో అదృష్టం కలిసొచ్చింది. నాగేంద్రన్‌కు కొవిడ్‌-19 నిర్ధరణ అయినట్లు జైలు అధికారులు తెలపటం వల్ల బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండి: భారత సంతతి వ్యక్తిని 'ఉరి' నుంచి కాపాడిన కరోనా!

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2021, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.