కశ్మీర్ అంశం సహా ఇతర సమస్యల పరిష్కారానికి భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలే కీలకమని సౌదీ అరేబియా సూచించింది. అంతేకాకుండా నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తామని పాక్, భారత్‌లు ఫిబ్రవరి 25న ప్రకటించడాన్ని స్వాగతించింది.
మే 7-9వరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పాకిస్థాన్ విదేశాంగ శాఖ శనివారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: పాక్ మంత్రి నోట ఆశ్చర్యపరిచే మాట!