రష్యాలో సామూహిక కొవిడ్ టీకా అందించాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నిర్ణయించారు. ఈ తరుణంలో వేలాది మంది వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు టీకా కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వ్యాక్సిన్ సమర్థతపై పరీక్షలు పూర్తికానప్పటికీ సామూహిక టీకా పంపిణీకి నిర్ణయించిన పుతిన్.. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా టీకా అందిస్తామని తెలిపారు. వైద్యులు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిష్టర్ చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 5 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. రష్యా మరికొన్ని రోజుల్లో 20లక్షల స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 91.2 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మధ్యస్థ పరిశీలనలో తేలింది. ప్రపంచంలోనే మొదటి కొవిడ్ టీకాగా స్పుత్నిక్-వీను గత ఆగస్టులో రిజిష్టర్ చేసింది రష్యా.
ఇదీ చదవండి: 'ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్'లో పూనావాలాకు చోటు