ఓ పక్షి తన కారుపై గూడుకట్టుకోవటంతో, దానికి హాని కలిగించటం ఇష్టం లేక ఏకంగా తన ఖరీదైన కారును వాడకుండా పక్కన పెట్టేశారు దుబాయి యువరాజు. దీంతో ఆయనపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దుబాయికి యువరాజు షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూంకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువగల మెర్సిడజ్ ఏఎంజీ జీ63 కారు విండ్‌షీల్డ్‌పై ఇటీవల ఓ పక్షి గూడు కట్టుకుంది. దానిలో గుడ్లు పెట్టి జాగ్రత్తగా పొదగటం ప్రారంభించింది. దీనిని గమనించిన యువరాజు రషీద్, దానిని వాడటం నిలిపివేశారు. ఆ పక్షికి ఏ విధమైన ఆటంకం కలిగించకుండా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
దానిని జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్న యువరాజు.. ఆ పక్షి పెట్టిన గుడ్ల నుంచి చిన్న పక్షిపిల్లలు బయటకు వస్తున్న వీడియోను ఇటీవల షేర్ చేశారు. అంతేకాకుండా 'మన జీవితంలో చిన్న చిన్న విషయాలే ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి' అనే వ్యాఖ్యను జతచేశారు. ప్రకృతి ప్రేమికుడైన తమ యువరాజును దుబాయి ప్రజలు, సన్నిహితులు ఆప్యాయంగా 'ఫజ్జా' అని పిలుచుకుంటారట. ఫజ్జా అంటే పేరుకు అరబ్బీలో 'సహాయం చేసేవాడు' అని అర్థమట. ఆ కారును, ఆ పక్షిగూడును మీరూ చూడండి మరి!
- " class="align-text-top noRightClick twitterSection" data="
">