భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై అమెరికా, చైనా విచారం వ్యక్తం చేశాయి. ప్రణబ్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరనిచైనా తెలిపింది. ఆయన ఎంతో అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడని కీర్తించిన పొరుగుదేశం.. భారత్- చైనా స్నేహబంధానికి ప్రణబ్ మరణం భారీ నష్టమని స్పష్టం చేసింది.
ప్రణబ్ ముఖర్జీకి చైనా తరఫున నివాళులు అర్పించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు.
"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపార అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. భారత్- చైనా సంబంధాల కోసం చాలా కృషి చేశారు. ఆయన మరణం రెండు దేశాల స్నేహబంధానికి భారీ నష్టం. ముఖ్యంగా భారత్కు. భారత ప్రభుత్వానికి, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం."
- హువా చున్యింగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2014లో భారత్ సందర్శించినప్పుడు ముఖర్జీతో భేటీ అయ్యారని చున్యింగ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.
అమెరికా భాగస్వామ్యాన్ని విశ్వసించారు..
అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్, అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యాన్ని ముఖర్జీ విశ్వసించారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
-
President Shri Pranab Mukherjee was a devout public servant who believed deeply in the importance of our two nations tackling global challenges together. Jill and I are saddened to hear of his passing — our prayers go out to his loved ones and the Indian people. pic.twitter.com/SJfaDEKjGi
— Joe Biden (@JoeBiden) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">President Shri Pranab Mukherjee was a devout public servant who believed deeply in the importance of our two nations tackling global challenges together. Jill and I are saddened to hear of his passing — our prayers go out to his loved ones and the Indian people. pic.twitter.com/SJfaDEKjGi
— Joe Biden (@JoeBiden) September 1, 2020President Shri Pranab Mukherjee was a devout public servant who believed deeply in the importance of our two nations tackling global challenges together. Jill and I are saddened to hear of his passing — our prayers go out to his loved ones and the Indian people. pic.twitter.com/SJfaDEKjGi
— Joe Biden (@JoeBiden) September 1, 2020
"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రజా సేవకుడు. మన రెండు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉన్న ప్రాముఖ్యాన్ని లోతుగా విశ్వసించారు. ఆయన మరణ వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యాం."
- జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
ముఖర్జీ, బైడెన్ మధ్య మంచి స్నేహ బందం ఉంది. అమెరికాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భారతీయ నేతల్లో ముఖర్జీ ఒకరు. ఆయన మరణం పట్ల చాలా మంది అమెరికా నాయకులు విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ప్రణబ్ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం