ETV Bharat / international

పాక్​లో ఘర్షణలు.. ఇస్లామిస్ట్​ పార్టీపై నిషేధం - పాకిస్థాన్​లో ఘర్షణలు

తెహ్రీక్​-ఈ-లబైక్​ పాకిస్థాన్​(టీఎల్​పీ) అధిపతి సాద్​ హుస్సేన్​ రిజ్వీని అరెస్టు చేయగా పాకిస్థాన్​లో ఆ పార్టీ మద్దతుదారులు వరుసగా మూడో రోజూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టం కింద టీఎల్​పీపై నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్​ ప్రభుత్వం తెలిపింది.

pakistan
పాకిస్థాన్​లో ఘర్షణలు
author img

By

Published : Apr 15, 2021, 6:47 AM IST

పాక్​లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో రాడికల్​ ఇస్లామిస్ట్​ పార్టీ తెహ్రీక్​-ఈ-లబైక్​ పాకిస్థాన్​(టీఎల్​పీ)పై నిషేధం విధించడానికి ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఆ పార్టీ అధిపతి సాద్​ హుస్సేన్​ రిజ్వీని అరెస్టు చేయగా సోమవారం నుంచి టీఎల్​పీ దేశవ్యాప్తంగా, ప్రధానంగా పాక్​లోని పంజాబ్​లో నిరసనలు చేపట్టింది. ఆ పార్టీ మద్దతుదారులు వరుసగా మూడోరోజూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో పోలీసులు సహా ఏడుగురు మృతి చెందారు. 300 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు 12 మంది మృతి చెందినట్లు కూడా టీఎల్​పీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద ఆ పార్టీపై నిషేధం విధిస్తున్నట్లు పాక్​ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్​ రషీద్​ అహ్మద్​ బుధవారం తెలిపారు. టీఎల్​పీని నిషేధించాలంటూ పంజాబ్​ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఆ పార్టీకి నిధులందించేవారిని కూడా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

కార్టూన్లతో మొదలు..

గతంలో ప్రవక్తపై కార్టూన్లు ప్రచురించినందుకు గాను ఫ్రెంచి రాయబారిని దేశ బహిష్కరణ చేయాలంటూ టీఎల్​పీ ఏప్రిల్​ 20 వరకు ఇమ్రాన్​ఖాన్​ ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే రిజ్వీని అరెస్టు చేయడం వల్ల ఆ పార్టీ పెద్దఎత్తున నిరసనలకు దిగింది. ప్రధాన రహదారులను దిగ్బంధిస్తూ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులకు ఆ పార్టీ కార్యకర్తలకు ఘర్షణలు చెలరేగాయి. ఈ మేరకు అన్ని రహదారులనూ ఖాళీ చేయించినట్లు మంత్రి అహ్మద్​ తెలిపారు. 2,000 మంది టీఎల్​పీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి.

కార్టూన్లకు సంబంధించి ఫ్రెంచి రాయబారిని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి బహిష్కరించడానికి గత ఏడాది నవంబరులోనే పాక్​లోని తెహ్రీక్​-ఈ-ఇన్సాఫ్​ ప్రభుత్వం టీఎల్​పీతో ఓ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పట్లోనే పెద్దఎత్తున నిరసనకు దిగిన టీఎల్​పీ ఈ ఒప్పందం కారణంగానే విరమించుకుంది. అనంతరం గడవును ఏప్రిల్​ 20 వరకు పొడగించారు. ఇందుకు సంబంధించి ఓ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే టీఎల్​పీ దీనికి నిరాకరిస్తూ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్​ చేసిందని మంత్రి చెబుతున్నారు.

ఇదీ చూడండి:'మయన్మార్​ నిరసనల్లో 51 మంది పిల్లలు మృతి'

ఇదీ చూడండి:'మే 1 నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.