ETV Bharat / international

కరోనా కాలంలోనూ మాల్దీవులు వెళ్లొచ్చని తెలుసా?

కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టాలని ప్రపంచదేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు మాత్రం రెండో దశ కరోనా వస్తుందేమోనని ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో గ్లోబల్​ టూరిజం కొంత మేర తెరుచుకున్నా.. పర్యటనలకు వెళ్లాలంటే భారీ ఖర్చులు మోయాల్సిందేననని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని దేశాలు స్వదేశీ టూరిజానికి ద్వారాలు తెరవగా.. మాల్దీవులు ఏకంగా అంతర్జాతీయ పర్యటకులకు స్వాగతం పలుకుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి..

smitha sharma interview
కరోనా కాలంలోనూ మాల్దీవులు వెళ్లొచ్చని తెలుసా..?
author img

By

Published : Jul 31, 2020, 9:02 AM IST

Updated : Jul 31, 2020, 11:12 AM IST

పర్యటకం.. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్‌ సర్దుకొని పర్యటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ వల్ల ఆ రంగం తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచ దేశాల ఆంక్షలు, వైరస్‌ భయాల మధ్య పర్యటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. అయితే కరోనా పరిస్థితి అదుపులోనికి వచ్చిందని భావించిన కొన్ని దేశాలు మాత్రం టూరిజానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాయి.

కరోనా కాలంలోనూ మాల్దీవులు వెళ్లొచ్చని తెలుసా..?

మాల్దీవులు...

మాల్దీవులకు దాదాపు 80 శాతం ఆదాయం పర్యటకం, దాని అనుబంధ సేవల ద్వారానే వస్తుంది. టూరిజాన్నే నమ్ముకున్న ఈ దేశం.. విదేశీ పర్యటకుల కోసం ఇప్పటికే ద్వారాలు తెరిచింది. టూరిస్టుల భద్రత, శానిటైజేషన్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పినా.. భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లేవారి సంఖ్య భారీగా తగ్గింది. ఎందుకంటే ఈ దేశంతోనూ భారత్​ సరిహద్దులను మూసివేయడమే ఇందుకు కారణం. అయితే ఈ అంశంపై మాలేలోని భారత హై కమిషనర్​ సంజయ్​ సుధీర్​తో మాట్లాడారు సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ. పలు అంశాలపై ఆయనతో సంభాషించారు.

ఆగస్టు నుంచే...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా అంతర్జాతీయ పర్యటకులకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన తొలిదేశం మాల్దీవులు. జులై 15 నుంచే టూరిజం సేవలు ప్రారంభించిన ఈ దేశం.. దాదాపు 200 రిసార్టుల్లో దాదాపు 60 తెరిచింది. అయితే రాజధాని మాలే బాగా రద్దీ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ కేసులు వస్తే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. అయిదే దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ప్రయాణికులను దీవుల్లోకే తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పర్యటన పూర్తయ్యాక మళ్లీ విమానాశ్రయంలో దించనున్నారు.

ఏటా దాదాపు 17 లక్షల మంది ఈ దేశంలో పర్యటిస్తే.. ఇందులో దాదాపు 5 లక్షల మంది భారత్​ నుంచే ఉండటం విశేషం. అందుకే ఆగస్టులో ముంబయి, కొచ్చిన్​ నుంచి అక్కడకు విమానాలు నడపాలని యోచనలో ఉంది. భారత్​-మాల్దీవుల మధ్య బయో బబుల్​ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సంజయ్​ స్పష్టం చేశారు. పరిమితంగా అయినా సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

మిగతా దేశాలతో పోలిస్తే జనాభా తక్కువ ఉండటం, ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రాంతం కావడం వల్ల కాస్త భద్రతాపరమైన ప్రాంతంగా దీన్ని భావిస్తున్నారు. అయితే ఒకవేళ సేవలు పునరుద్ధరించినా.. కరోనా సమయంలో ఎంతమంది అక్కడకు వెళ్లేందుకు సాహసం చేస్తారనేది ప్రశ్నగా మారింది.

ఇప్పటికే థాయ్​లాండ్​, ఐరోపా​ దేశాలు స్వదేశీ పర్యటకంతోనే నిధులు సమకూర్చుకుంటున్నాయి. ఇటలీ, స్పెయిన్​, గ్రీస్​ దేశాలతోనూ చర్చలు జరుగుతున్నప్పటికీ .. ఆ దేశాల నుంచి వచ్చేవారు, వెళ్లేవారు టెస్టు చేసి క్వారంటైన్​లో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆయా దేశాల టూరిజం.. ఇప్పుడు పర్యటనకు వెళ్లేవారిపై భారం మోపనుంది. అంతేకాకుండా మరోదశ కరోనా కేసులు రావొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యటకులకు ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రభుత్వాలు వెనకడుగువేస్తున్నాయి.

భారీ నష్టాలు..

యూఎన్​ కాన్ఫరెన్స్​ ఆన్​ ట్రేడ్​ అండ్​ డెవలప్​మెంట్​ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం... ప్రపంచ పర్యటక రంగం దాదాపు 1.2 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోనుంది. ఇది గ్లోబల్​ జీడీపీలో 1.5 శాతంగా పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 10 మిలియన్ల మంది భారతీయులు పర్యటనలు రద్దు చేసుకుంటారని.. వచ్చే ఏడాది ఆ సంఖ్య 29 మిలియన్లకు చేరుకుంటుందని అందులో అంచనా వేశారు. కొవిడ్ రాకముందు దాదాపు 50 మిలియన్ల మంది భారత పర్యటకులు విదేశీ ప్రయాణాలు చేశారు. ఇందులో సింగపూర్​, థాయ్​లాండ్, ఇండోనేసియా, మాల్దీవులు, నేపాల్​, శ్రీలంక, భూటాన్​ దేశాలకు ఎక్కువగా పర్యటించేవారు. అయితే ఇప్పట్లో టూరిజం కోలుకోవడం కాస్త కష్టమేనని అభిప్రాయపడ్డారు థాయిలాండ్​ టూరిజం డైరెక్టర్​ సిరిసుంపన్​.

"థాయ్​లాండ్​లోనూ స్వదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రం కాస్త సమయం పట్టొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటకుల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. దానిని కాపాడడం ఎన్నో సవాళ్ల​తో కూడుకున్నది. అయితే థాయ్​లాండ్​లో పని కోసం, వైద్య అవసరాల కోసం వచ్చేవారికి ఎలాంటి అడ్డంకులు లేవు" -సిరిసుంపన్​.

విదేశీ పర్యటకులను ఆకర్షించడం వల్లే గ్లోబల్​ టూరిజం బతికి బట్టకడుతుందని తెలిపారు థాయ్​లాండ్​ టూరిజం అధికారులు. వారు పెట్టే ఖర్చుకు సరైన సేవలందిస్తే.. కాస్త ఎక్కువ ధరలున్నా పర్యటకులు ప్రయాణాలు చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రతి దేశంలోని ప్రతి హోటల్​, రిసార్టు ప్రత్యేకమైన మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు.

Last Updated : Jul 31, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.