ETV Bharat / international

'అప్పటి వరకు భారత్​తో చర్చలు లేవు'

జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదాపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. కశ్మీర్​ స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు భారత్​తో చర్చలకు అవకాశం లేదని పునరుద్ఘాటించారు.

author img

By

Published : Jan 11, 2021, 5:27 AM IST

Imran khan
పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు భారత్​తో చర్చలకు అవకాశం లేదని పాతపాటే పాడారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. ఇస్లామాబాద్​లో డిజిటల్​ మీడియా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా భారత్​తో చర్చలపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు ఇమ్రాన్​.

" జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు భారత్​తో చర్చలకు అవకాశమే లేదు. పాకిస్థాన్​ను అస్థిరపిచేందుకు ప్రయత్నిస్తున్న భారత్​ మినహా మాకు ఏ దేశంతోనూ విభేదాలు లేవు."

- ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

2016లో పఠాన్​కోట్​లోని వైమానిక స్థావరంపై పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రమూకలు దాడి చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఉరిలోని భారత సైనిక క్యాంపుపై దాడితో సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్​పీఎప్​ జవాన్లను పొట్టనపెట్టుకున్న క్రమంలో 2019, ఫిబ్రవరి 29న పాకిస్థాన్​లోని జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు చేసింది భారత్​. దాంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అదే ఏడాది ఆగస్టులో జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి, ఆర్టికల్​ 370 రద్దు చేసింది కేంద్రం. దీనిపై పాకిస్థాన్​ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టింది.

ఇదీ చూడండి: మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.