ETV Bharat / international

'పాక్​లో పీఓకే విలీనంపై వార్తలు అవాస్తవం'

పాక్​ తమ దేశంలో పీఓకేను విలీనం చేయాలని భావిస్తోందని వచ్చిన వార్తలను పాకిస్థాన్ ప్రభుత్వం తప్పుబట్టింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేసింది.

No proposal for PoK merger with Pakistan: FO
'పాక్​లో పీఓకే విలీనంపై వార్తలు అవాస్తవం'
author img

By

Published : Jan 31, 2020, 5:06 PM IST

Updated : Feb 28, 2020, 4:25 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)ను తమ దేశంలో విలీనం చేయాలని భావిస్తోందంటూ వచ్చిన వార్తలను పాకిస్థాన్​ కొట్టిపారేసింది. ఆరు వారాలుగా పాకిస్థాన్​కు చెందిన ఓ దినపత్రికలో పీఓకే విలీనం గురించి వరుస వార్తలు వస్తున్నాయి. పీఓకే చివరి ప్రధానమంత్రి తానే అవుతానని ఫరూక్​ హైదర్ ఖాన్​ చెప్పినట్లు ఆ వార్తా సంస్థ ప్రచురించింది.

అవన్నీ ఊహాగానాలే..

ఈ వార్తలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఈషా ఫరూక్​ స్పందించారు. పీఓకే విలీనంపై ఎటువంటి ప్రతిపాదన తమ పరిశీలనలోకి రాలేదని స్పష్టం చేశారు. గిల్గిట్​- బాల్టిస్థాన్​ హోదాలో మార్పులపై కొత్త నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలనూ ఈషా తప్పుబట్టారు. ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని స్పష్టం చేశారు.

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో

జమ్ముకశ్మీర్​లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పాక్​ ఈ మార్గాన్ని అనుసరించనున్నట్లు పాక్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే పీఓకే తమ అంతర్భాగమని భారత్​ ఉద్ఘాటిస్తోంది.

ఇదీ చూడండి: 'పైసా వసూల్​'పై యోగి సర్కార్​కు సుప్రీం తాఖీదులు

Last Updated : Feb 28, 2020, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.