ETV Bharat / international

'అఖిలపక్ష' ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని పిలుపు

నేపాల్​లోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఆ తర్వాత మరోసారి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దేశం అనిశ్చితిలో ఉందని, ఇందుకు పార్లమెంట్​ సరిగ్గా లేకపోవడమే కారణమన్నారు.

all-party govt in nepal
నేపాల్​లో అఖిలపక్ష ప్రభుత్వం
author img

By

Published : May 28, 2021, 8:56 PM IST

రాజకీయ సంక్షోభంలో ఉన్న నేపాల్​లో 'అఖిలపక్ష' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించారు. దేశంలోని అస్థిరతకు పార్లమెంట్​ సరిగ్గా లేకపోవడమే కారణమన్నారు.

ఓవైపు పార్లమెంట్​ను దేశ అధ్యక్షురాలు రెండోసారి రద్దు చేయడాన్ని సమర్థిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు ఓలీ. పార్లమెంట్​ రద్దుకు వారే కారణమని ఆరోపించారు. అసలు రద్దు కాకుండా చూసుకునేందుకు తాను శ్రమించానని, కానీ విపక్షాల నీచ రాజకీయల వల్ల పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు.

275 మంది ఉన్న ప్రతినిధుల సభ గత 5 నెలల్లోనే శనివారం రెండో సారి రద్దు అయ్యింది. నవంబర్​ 12, 19న ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: 'టిబెట్​' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.