ETV Bharat / international

అరుదైన చిరుతల సంరక్షణకు ఆవాస కేంద్రం - సంరక్షణ

మనుషులకు పునరావాస కేంద్రాలు చూశాం.. సాధు జీవులకు సంరక్షణ కేంద్రాలుంటాయని విన్నాం. అయితే మధ్యప్రాచ్యంలోని కిర్గిజిస్థాన్​లో చిరుత పులుల కోసం ఓ ఆవాస కేంద్రం ఏర్పాటు చేశారు.

అరుదైన చిరుతల సంరక్షణకు ఆవాస కేంద్రం
author img

By

Published : Jun 2, 2019, 7:46 PM IST

అరుదైన చిరుతల సంరక్షణకు ఆవాస కేంద్రం

'మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటుందో తెలుసా'- ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది. అవును చిరుత గాండ్రింపు గంభీరం. ఎవరైనా వేగంగా పరిగెడితే చిరుతతో పోలుస్తారు. చిరుత పంజా విసిరితే వేట జీవి మట్టికరవాల్సిందే.

సాధారణంగా కష్టాలొస్తే మనుషులమైతే మరొకరి సాయం తీసుకుంటాం. గుంపు జీవులైతే ఎలాగోలా నెట్టుకొస్తాయి. అలాంటిది చిరుత గాయాలపాలై పరిగెత్తలేక పోతే... వేటాడే జంతువును భయపెట్టలేకపోతే... ఆకలితో అలమటిస్తే... ఇలాంటి పరిస్థితి వస్తే ఒంటరి జీవి చిరుత మాత్రం ఆకలితో మాడి మరణించాల్సిందే. అరుదైన కిర్గిజిస్థాన్ మంచు కొండ చిరుతల పరిస్థితి ఇప్పుడు ఇలానే మారింది. వీటి సంరక్షణ కోసం 'ఇస్సిక్ కుల్' కేంద్రం ఏర్పాటు చేసింది అక్కడి సర్కారు.

1990లో కిర్గిజిస్థాన్​లో వంద మంచు పులులుండేవి. మానవులు వేటాడటం కారణంగా తగ్గుతూ వచ్చాయి. చిరుతల సంఖ్య తగ్గుతుందని గుర్తించిన ప్రభుత్వం... సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఈ సంరక్షణ కేంద్రాన్ని జర్మనీకి చెందిన ప్రకృతి, జీవవైవిధ్య సమాఖ్య (నాబు) వారు ఏర్పాటు చేశారు. గాయపడిన మంచు చిరుతలకు చికిత్స అందిస్తారు సిబ్బంది. బయటకెళ్లి బతుకుతుందనుకుంటే వదులుతారు.

ఈ కేంద్రం ఏర్పాటుతో సత్ఫలితాలు అందుతున్నాయి. గత ఐదేళ్లలో చిరుతల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

"ఈ మంచు చిరుతల సంరక్షణ కేంద్రాన్ని 2002లో ఏర్పాటు చేశారు. మేం సంరక్షించిన మొదటి మంచు చిరుత పులులు అల్సౌ, బగిరా, కునాట్​లు. వేటగాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న చిరుతలను సంరక్షించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుంది. మా సిబ్బంది వేటగాళ్లకు చిక్కిన చిరుతలను సంరక్షణ కేంద్రానికి తీసుకువస్తారు. 2002 నుంచి చిరుతలు మాతో ఉన్నాయి. వాటిని బయటకు వదిలితే స్వతహాగా ఆహారాన్ని సంపాదించుకోలేవు." -ఉర్లన్​భాయ్ సులేమానోవ్, అటవీ అధికారి.

2016లో ప్రపంచ అటవీ జంతువుల నిధి ప్రపంచ వ్యాప్తంగా 4వేల మంచు చిరుతలున్నట్లుగా లెక్కగట్టింది. అంతర్జాతీయ ప్రకృతి సమాఖ్య చాలా కాలంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న మంచు చిరుతలను 2017లో ఆ జాబితా నుంచి తప్పించింది. ప్రస్తుతం కిర్గిజిస్థాన్​లో 300 నుంచి 500 చిరుతలు ఉన్నట్లు అంచనా.

అందరికీ తెలిసిన విధంగానే మంచు చిరుత చాలా ప్రమాదకర జంతువు. వాటి సంరక్షణే కాదు... ఎన్ని ఉన్నాయని లెక్కించడమూ అంత సులభమేమీ కాదు... ప్రస్తుతం కిర్గిజిస్థాన్ మంచు చిరుతలను సంరక్షించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -కుమార్ మంబెటలియెవ్, అటవీ అధికారి

ఓవైపు మంచు చిరుతల సంరక్షణకు కిర్గిజిస్థాన్ సర్కారు చర్యలు చేపడుతున్నా... కొంతమంది పర్యావరణ వేత్తలు మాత్రం మంచు చిరుతలకు ఇంకా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

మంచు చిరుతల పరిస్థితి దేశంలో అంత ఆశాజనకంగా లేదు. ఏటా వేట జంతువుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొండగొర్రెలు వంటి జంతువులు మానవులకు సాధుజంతువులుగా మారాయి. మంచు చిరుతల పరిధి కుచించుకుపోతూ వస్తోంది.-వ్లాద్ ఉషకోవ్, పర్యావరణవేత్త

ఇదీ చూడండి: 'సోషల్' వివరాలు ఇస్తేనే​ అమెరికా వీసా

New Delhi, May 30 (ANI): Senior BJP leaders Nitin Gadkari took oath as a union minister at Rashtrapati Bhavan in presence of President Ram Nath Kovind and Prime Minister Narendra Modi.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.