ETV Bharat / international

పెట్రో ధరల పెంపుపై నిరసనల్లో హింస- పదుల సంఖ్యలో మృతి

author img

By

Published : Jan 6, 2022, 2:32 PM IST

Updated : Jan 6, 2022, 4:42 PM IST

Kazakhstan unrest: కజకిస్థాన్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళన... హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది పోలీసులు కూడా ఉన్నారు.

Kazakhstan unrest
కజకిస్థాన్ ఆందోళన
కజకిస్థాన్​లో పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు

Kazakhstan unrest: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కజికిస్థాన్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు.. హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం సహా 12 మంది పోలీసులు మరణించారు. అందులో.. ఓ పోలీసు అధికారి తలను నిరసనకారులు నరికేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారులు తెలిపారు.

Kazakhstan fuel price protests: పెట్రో ధరల పెంపుపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు.. అల్మాటీ నగరంలోని మేయర్ భవనం సహా పలు ప్రభుత్వ భవనాలను దగ్ధం చేసేందుకు బుధవారం రాత్రి యత్నించారని పోలీసు అధికార ప్రతినిధి సల్తానత్​ అజెరిక్​ తెలిపారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణల్లో నిరసనకారులతో పాటు పలువురు పోలీసులు మరణించారని చెప్పారు.

Kazakhstan unrest
కజకిస్థాన్​లో ప్రభుత్వ భవనాలకు నిప్పంటించిన నిరసనకారులు
Kazakhstan unrest
కజకిస్థాన్​లో నిరసనకారులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
Kazakhstan unrest
కజకిస్థాన్​లో నిరసనలు
Kazakhstan unrest
నిరనసల్లో ధ్వంసమైన భవనం అద్దాలు
Kazakhstan unrest
కజకిస్థాన్​లో నిరసనలు

స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కజకిస్థాన్​లో గత మూడు దశాబ్దాలుగా వివిధ ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కజకిస్థాన్​కు రష్యా నేతృత్వంలోని సైనిక కూటమి, ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటి ఆర్గనైజేషన్​... తమ శాంతి పరిరక్షక దళాలను పంపుతామని గురువారం ప్రకటించింది.

ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కజకిస్థాన్​లోని పశ్చిమ ప్రాంతంలో ప్రారంభమైన ఈ నిరసనలు... అల్మాటీ నగరానికి వ్యాపించాయి. బుధవారం నాటికి తీవ్రరూపం దాల్చాయి.

ఇదీ చూడండి: Lithuania Taiwan: 'చైనాను ఎదిరించావు.. నీకు అండగా నేనున్నాను!'

ఇదీ చూడండి: భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మృతి

Last Updated : Jan 6, 2022, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.