గురునానక్‌దేవ్ 550వ జయంతి వేడుకల కోసం సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్‌పుర్ సిద్ధంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్తార్‌పుర్ సముదాయం (కాంప్లెక్స్), గురుద్వారా దర్బార్ సాహిబ్ చిత్రాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నవంబర్ 9న కర్తార్‌పుర్ నడవా ప్రారంభం కాబోతోంది.
"సిక్కు యాత్రికులను స్వాగతించడానికి కర్తార్‌పుర్ సిద్ధంగా ఉంది."- ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి
కర్తార్‌పుర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసిన ప్రభుత్వ అధికారులను కూడా ఇమ్రాన్‌ఖాన్ అభినందించారు.
సిక్కు మత వ్యవస్థాపకుడైన గురునానక్ అవిభక్త భారత్ (నేడు పాకిస్థాన్)లోని నంకనా సాహిబ్‌లో జన్మించారు. ఈ ఏడాది ఆయన 550వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కర్తార్‌పుర్ నడవా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది.
పాక్ పర్యాటకం
పాకిస్థాన్‌లోని సిక్కు పవిత్ర ప్రదేశాలకు సిక్కులను ఆకర్షించడం ద్వారా మత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నది ఇమ్రాన్‌ఖాన్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి: 'భారత్-ఆసియాన్ దేశాల పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి'