ETV Bharat / international

పాక్‌ భూభాగంలో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రైక్‌! - పాక్​-ఇరాన్​ యుద్ధం

పాక్​ ఉగ్రవాద శిబిరంపై మెరుపుదాడులు చేసింది ఇరాన్​ సైన్యం. ఇరాన్​ సైనిక విభాగంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్​ బలగాలు ఈ దాడులు చేపట్టి.. బలూచిస్థాన్​ జైల్లో ఉన్న తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులకు విముక్తి కల్పించింది.

Iran surgical strike on Pak Territory
పాక్‌ భూభాగంలో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రైక్‌!
author img

By

Published : Feb 5, 2021, 2:01 PM IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్‌ మెరుపు దాడులు(సర్జికల్‌ స్ట్రైక్‌) చేసింది. ఇరాన్‌ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్‌ దళం(ఐఆర్‌జీసీ) వీటిని చేపట్టింది. రెండున్నరేళ్లుగా బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ సైనికులిద్దరినీ విడిపించుకెళ్లింది. నిఘా సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ తాజాగా వెల్లడించింది.

బలూచిస్థాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద ముఠా 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. వారిని రెండు దేశాల సరిహద్దుల్లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో మెర్కావా నగరానికి తరలించింది.

గతంలోనూ..

ఈ ముఠా కొన్నేళ్లుగా ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని నడుపుతోంది. ఇరాన్‌ సైనికులను విడిపించడానికి పాక్, ఇరాన్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. 2018 నవంబర్‌లో ఐదుగురు బందీలకు విముక్తి లభించింది. మరో నలుగురిని 2019లో పాక్‌ సైన్యం విడిపించింది. తాజా మెరుపు దాడుల్లో ఇద్దరు బందీలకు విముక్తి లభించింది. జైష్‌ ఉల్‌ అదల్‌.. ఇరాన్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడింది. 2019 ఫిబ్రవరిలో పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని చంపేసింది. ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి, పాక్‌కు తరలించుకెళ్లిన ఉదంతాలు గతంలోనూ జరిగాయి. ఈ నేపథ్యంలో పాక్‌ తీరుపై ఇరాన్‌ సైన్యం ఆందోళన వ్యక్తంచేసింది. సరిహద్దు భద్రతపై పొరుగు దేశం తీరు చాలా ఉదాసీనంగా ఉందని ఆక్షేపించింది. 2016లో భారత సైన్యంలోని పారా కమాండోలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి.. అనేక మంది ముష్కరులను హతమార్చాయి.

ఇదీ చదవండి: చైనా కనుసన్నల్లో పాక్‌- 'కశ్మీర్‌' పేరిట హింసోన్మాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.