ETV Bharat / international

'ఫోర్బ్స్ ఆసియా 30​​' జాబితాలో భారతీయుల సత్తా!

పోర్బ్స్​ ఆసియా 30 అండర్​ 30- 2021 జాబితాలో 76 మంది స్థానం సంపాదించి భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత చైనా, జపాన్​లు ఉన్నాయి. నాలుగో స్థానంలో నిలిచిన సింగపూర్​ నుంచి 31 మందికి చోటు లభించగా అందులో 8మంది భారతీయులే ఉండటం గమనార్హం.

author img

By

Published : May 17, 2021, 1:15 PM IST

forbes list
ఫోర్బ్స్ ఆసియా 30

'ఫోర్బ్స్​ 2021 ఆసియా 30 అండర్​ 30' జాబితాలో భారతీయులు సత్తా చాటారు. ఏప్రిల్​లో విడుదలైన ఈ జాబితాలో మొత్తం 76 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. 30ఏళ్లలోపు యువతీ యువకులు వారు ఎంచుకున్న రంగంలో అత్యంత సృజనాత్మకతతో, ధైర్యంగా ముందుకు సాగుతూ సమాజంపై ప్రభావం చూపుతున్న వారిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో చైనా (36), జపాన్​ (31 ఉన్నాయి.

సింగపూర్​ నుంచి 8మంది భారతీయులు..

ఈ జాబితాలో చోటు దక్కిన వారు ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే వారి దేశంగా భావిస్తున్న నేపథ్యంలో భారతీయులు ఇతర నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో 27 ఎంట్రీలతో సింగపూర్​ 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 31 మంది వ్యక్తులు ఉండగా అందులో 8 మంది భారతీయులే ఉండటం గమనార్హం. ఒక సంస్థ నుంచి ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఒకే ఎంట్రీగా భావిస్తారు.

సింగపూర్​ ఒక చిన్న దేశం అయినప్పటికీ, పటిష్ఠ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఆకర్షణీయమైన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సోహకాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాల కారణంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతను సింగపూర్​ వైపు నడిపిస్తున్నాయి.

గత ఆరేళ్లుగా ఆసియా జాబితాను విడుదల చేస్తోంది పోర్బ్స్​. 30 మంది వ్యవస్థాపకులు లేక బృందాలను 10 అంశాలను పరిగణించి ఈ జాబితాను రూపొందిస్తారు. అందులో ప్రధానంగా సమాజంపై ప్రభావం, కళలు, వినోదం, క్రీడలు, ఫైనాన్స్​, హెల్త్​కేర్​ అండ్​ సైన్స్​, వినియోగదారుల సాంకేతికత వంటివి ఉన్నాయి.

జాబితాలోని కీలక అంశాలు...

  • ఈ ఏడాది ఆసియా జాబితాలో 15.6 శాతం మంది 23 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. జాబితాలోని వారి సగటు వయస్సు 26.5 శాతం. జపాన్​కు చెందిన 11 ఏళ్ల సుమైర్​ నకమురా అంత్య పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.
  • ఈసారి విడుదలైన జాబితాలో 22 ప్రాంతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ దాదాపు రెండింట మూడొంతులు టాప్​-5 దేశాల నుంచే ఉన్నారు. దీని ద్వారా.. సృజనాత్మక ఆలోచనలు, యువతను ప్రోత్సహించే వాతావరణం ఆయా దేశాల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
  • ఈ జాబితాలో 67.8 శాతం మంది సంస్థల వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు ఉన్నారు.

సింగ్​పూర్​ టెక్​ సంస్థ టీమ్​ ల్యాబ్స్​ సీఈఓ, భారత సంతతి వ్యక్తి హర్ష దలాల్​ పేరును ఆసియా 30 జాబితా నుంచి తొలగించిన క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ జాబితాపై కొంత వ్యతిరేకత వచ్చింది. టెక్​ ఇన్​ ఆసియాలో టీమ్ ల్యాబ్స్​పై వ్యతిరేక వార్తలు వచ్చిన క్రమంలో దలాల్​ సంస్థపై చర్యలు చేపట్టింది పోర్బ్స్​ సంస్థ. అతని పేరును తొలగించింది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో సరికొత్త వెంచర్లు.. కళల్లో నైపుణ్యం.. ఫోర్బ్స్​లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.