ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో వరదలు.. 37 మంది మృతి - Heavy flooding in Afghanistan news

అఫ్గానిస్థాన్​లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి 37 మంది మరణించారు. వీరిలో కొంతమంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి అఫ్గాన్​లోని 9 రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy flooding in Afghanistan
అఫ్గానిస్థాన్​లో వరదలు
author img

By

Published : May 4, 2021, 10:59 PM IST

అఫ్గానిస్థాన్​లో భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. దీని వల్ల 37 మంది మరణించారు. వీరిలో కొంతమంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి అఫ్గాన్​లోని 9 రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

వరదల కారణంగా ఆదివారం ఒక్కరోజే 24 మంది మరణించినట్లు గవర్నర్ల అధికార ప్రతినిధి జైలాని ఫర్హాద్ తెలిపారు.ఘోర్ రాష్ట్రంలో మరణించిన 10 మందిలో ఆరుగురు పిల్లలు ఉన్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ తాహిర్ ఫైజ్​దా పేర్కొన్నారు.

ఇప్పటివరకు 405 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విపత్తు నిర్వాహణ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : కన్నడనాట కరోనా విలయం- మహారాష్ట్రలో మృత్యుఘోష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.