కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 183 దేశాలకు పాకింది. ఇప్పటి వరకు మొత్తం 7,24,565 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి ధాటికి 34,017 మంది మృతి చెందారు.
అత్యధికంగా అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,43,735 మందికి వైరస్ సోకగా.. 2,514 మంది బలయ్యారు. 97,689 కేసులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది ఇటలీ. ఈ దేశంలో 10,779 మంది మరణించారు. వైరస్ కేంద్రబిందువు చైనాలో 81,470 కేసుల నమోదవ్వగా... 3,304 మంది మరణించారు.