ETV Bharat / international

బ్రహ్మపుత్రపై డ్యామ్​ నిర్మాణానికి చైనా సిద్ధం - బ్రహ్మపుత్రపై జల విద్యుత్తు కేంద్రం

బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్​ నిర్మాణం కోసం వేగంగా సన్నాహాలు చేస్తోంది చైనా. బ్రహ్మపుత్రపై హైడ్రోపవర్​ ప్రాజెక్ట్​ నిర్మాణం సహా 60 కీలక ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు ఆ దేశ పార్లమెంట్ గురువారం​ ఆమోద ముద్ర వేసింది. డ్రాగన్​ నిర్ణయంతో భారత్​, బంగ్లాదేశ్​లోని నదీ పరివాహక రాష్ట్రాలకు తీరని నష్టం చేకూరనుంది.

build dam on Brahmaputra in Tibet
బ్రహ్మపుత్రపై డ్యామ్​ నిర్మాణానికి చైనా పార్లమెంట్​ ఆమోదం
author img

By

Published : Mar 11, 2021, 4:38 PM IST

భారత్​తో ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే చాపకింద నీరులా వ్యవహరిస్తోంది చైనా. అరుణాచల్​ప్రదేశ్​కు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు బిలియన్ల డాలర్లు విలువైన ప్రాజెక్టులతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు చైనా పార్లమెంట్​ గురువారం ఆమోద ముద్ర వేసింది. అందులో వివాదాస్పద బ్రహ్మపుత్ర నదిపై జలాశయ నిర్మాణమూ ఉంది. ఈ డ్యామ్​ నిర్మాణంపై మొదటి నుంచి భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

2వేలకుపైగా సభ్యులు కలిగిన చైనా పార్లమెంట్​-నేషనల్​ పీపుల్స్​ కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున..​ 14వ పంచవర్ష ప్రణాళిక(2021-2025)కు ఆమోదం తెలిపింది. ఇందులో జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 2035 వరకు దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు చైనా అభివృద్ధిని వేగవంతం చేసే 60 ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, ప్రధాని లి కెషాంగ్​, ఇతర సీనియర్​ నేతలు హాజరయ్యారు.

ఈ ప్రణాళికకు గత ఏడాదే ఆమోదం తెలిపింది అధికార కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా (సీపీసీ).

బ్రహ్మపుత్రపై డ్యామ్​ ప్రధాన లక్ష్యమా?

బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్​ నిర్మించే ప్రతిపాదనను 14వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది చైనా. ఇప్పటికే ఈ నిర్మాణంపై భారత్​తో పాటు బంగ్లాదేశ్​లో పరివాహక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని చెబుతూనే నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల నీటి వినియోగ హక్కులపై భారత్​ ఎప్పటికప్పుడు చైనా అధికారులతో తమ ఆందోళనలను తెలియచెబుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో చేపట్టే పనులతో దిగువన ఉన్న వారికి ఎలాంటి హాని కలగదని భరోసా కల్పించాలని కోరుతోంది.

ఎన్​పీసీ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఈ ఏడాదిలో జలాశయ నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు టిబెట్​ కమ్యూనిస్ట్​ పార్టీ ఉపాధ్యక్షుడు చె డల్హా తెలిపారు. ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రణాళిక, పర్యావరణ అనుమతులు త్వరలోనే వస్తాయన్నారు. అలాగే.. ఉత్తర టిబెట్​లో వచ్చే ఐదేళ్లలో సహజ వాయువు ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.

అరుణాచల్​ ప్రదేశ్​తో సరిహద్దు పంచుకుంటున్న చివరి కౌంటీ అయిన మెడాగ్​లోని యార్లూంగ్​ జాంగ్బో లోయ ప్రాంతంలో ఈ డ్యామ్​ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది చైనా.

2015లోనే..

టిబెట్​లో ఇప్పటికే 2015లో యాంగ్మూ హైడ్రోపవర్​ స్టేషన్​ను 1.5 బిలియన్​ డాలర్లతో నిర్మించింది చైనా. అది టిబెట్​ ప్రాంతంలోనే అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం. మరోవైపు.. సరిహద్దు నదులపై సమస్యల పరిష్కారానికి భారత్​-చైనా ఉన్నతస్థాయి వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశాయి. ఇరు దేశాల మధ్య కుదురిన ఒప్పందాల ప్రకారం వరదల సమయంలో బ్రహ్మపుత్ర, సట్లెజ్​​ నదుల సమాచారాన్ని భారత్​కు అందిస్తుంది చైనా.

ఇదీ చూడండి: భారత్‌పై చైనా జలాయుధం!

డ్యామ్​ నిర్మాణంపై చైనాకు భారత్​ హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.